Saturday, 19 February 2011

నా బాల్యం మళ్ళీ తిరిగి వచ్చినట్లు అయింది

మధ్యాహ్నం అంతా నిద్రపోయి చీకట్లు ముసురుతున్నపుడు మెలుకువ వచ్చి,
అది తెల్లవారు జామో లేక సాయం సంధ్యో తెలియని అయోమయం లో బద్దకం గా మరో అరగంట అలాగే పడుకుని,
అమ్మ పెట్టిన వేడి వేడి నీళ్ళు ,పియర్స్ సోప్ ( చిన్నప్పుడు దానితో స్నానం) తో కరువుదీరా స్నానం చేసి..
వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించి ,
మేడ మీద చీకట్లో అలా అలా పచార్లు చేస్తుంటే
మళ్ళీ బాల్యం లోకి వెళ్ళిపోయిన అనుభూతి.
ప్రపంచం లో ఆనందం అంతా గుప్పెటలో మూసేసుకున్నట్లు అయ్యింది .
నా భాల్యం మళ్ళీ తిరిగి వచ్చినట్లు అయింది ఆ కొద్ది సేపూ

7 comments:

లత said...

స్వాగతం స్నేహ గారూ,మీ చిన్ని పోస్ట్ బాగుంది.
బాల్యం ఎప్పటికీ మధురమే కదా

sneha said...

లత గారు అవునండి భాల్యం ఎప్పుడూ మధురమే ,ధన్య వాదాలు

మాలా కుమార్ said...

మీ బాల్యం లోకి మమ్మలినీ తీసుకెళ్ళారుగా !

బాగుంది మీ బ్లాగ్ .

sneha said...

మాలా కుమార్ గారు ధన్య వాదాలు

శిశిర said...

చక్కటి అనుభూతి. బాగా రాశారు.

sneha said...

శిశిర గారు ధన్యవాదాలు

Vineela said...

ఈ రోజు అలాగే అయింది అ౦డి మధ్యానం నిద్ర లేవగానే ఇది శనివారమా లేక ఆదివారమా అని అనిపించింది..గాని ఆ మధ్యానం నిద్ర లో వున్నా ఆనందం మరి దేన్లోను ఉండదు.