Sunday, 20 February 2011

ఏం తినేటట్లు లేవు

ఇంతక ముందోసారి  ఫ్రెండ్ మామిడి తోటకు వెళ్తే మామిడికాయలు  రాసులుగా పోసి ఉన్నాయి.పనివాళ్ళు వాటి పై ఏదో రసాయనాలు పోస్తున్నారు.ఏమిటవి? అని అడగ గానే  కాయలు వెంటనే పండి రసాలుగా తయారవ్వడానికి అట.మేము చూస్తుండగానే పసుపురంగులో మారి పోయి నిగ నిగలాడాయి.

మొన్న ఏదో టివి చానెల్ చూస్తుంటే పచ్చని అరటి పళ్ళపై ఇదే రసానియాన్ని జల్లుతున్నారు వెంటనే మగ్గిపోవడానికి . అలాంటి రసానియాలు జల్లిన పళ్ళు తింటే చాలా జబ్బులు వచ్చే అవకాశం ఉందిట .

డాక్టర్ సలహా మేరకు ఐరన్ బాగా పట్టడానికి అమ్మ రెండు రకాలా ఆకు కూరలు తెచ్చి వండగానే ఇంట్లో వాళ్లకు వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి . ఫుడ్ పాయిజన్ అయిందేమో అని మళ్ళీ డాక్టర్ 
 దగ్గరకు పరుగులు పెడితే , ఆకు కూరల పై జల్లిన రసానియాలే కారణం  బాగా ఉప్పు నీటిలో కడిగి తినండి అన్నారు.

పై పై పూతలు అయితే కడిగేస్తాం .నిరంతరం వాటినే పీల్చుకుని ఉన్న వాటిని ఎలా కడిగేది? ఎలా  తినేది?

2 comments:

muralirkishna said...

స్నేహా గారు బ్లాగ్ బాగుంది ..నిజమే మీరు చెప్పింది ..కూరలు ఐతె బాగా కడిగి వండుకొగలము..కానీ రొజు మనం పీల్చే కాలుష్యపు గాలి వల్ల మన శరీరం ఎంత చెడిపోతుందొ కదా!

sneha said...

అవునండి తినే తిండి పీల్చేగాలి అన్నీ కల్తీ ,అపాయకరమైనవి అయిపోతున్నాయి