Tuesday, 22 February 2011

ఎవరు కరెక్ట్ ?

ఒకసారి ఫ్రెండ్ తో షాపింగ్ కి వెళ్లాను.అరగంట చూసాకా నాకో డ్రెస్ నచ్చింది పేక్ చేయించుకుని బిల్లు కట్టేసి వచ్చాను.తనది ఇంకా సెలెక్షన్ అవ్వలేదు.మరో పావుగంటకు సేల్స్ గర్లుకు విసుగొచ్చినట్లు ఉంది.అన్నీ అవే కలర్లు అండి .క్రొత్తవేమీ లేవు అనేసింది.  ఇంకో గంటకు షాప్ మొత్తం తిరగేసి మరగేసి మొత్తానికి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసింది .

బిల్లు కట్టే సమయానికి తన చూపులు షోకేస్ లో ఒక మూలకున్న డ్రెస్ మీద పడింది .బిల్ ఆపు చేసి ఆ డ్రెస్సులు తీయించింది.షాపువాడు ,సేల్స్ గళ్  కాస్త విస్క్కున్నారు .అరగంటకు ఇంకో డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది .నాకు షాపువాడి చిరాకుకు ఇబ్బందిగా అనిపించింది.కాని డ్రెస్ బాగుంది .

మళ్ళీ బిల్లు కట్టే సమయానికి ప్రక్కన మరొక ఆమె సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ మీద పడ్డాయి ఫ్రెండ్  చూపులు .బిల్లు ఆపి అటువంటి డ్రేస్స్లు ఉన్న చోటికి వెళ్లి అక్కడో పావుగంట చేసి ఒకటి సెలెక్ట్ చేసుకుంది .కొనే బెరమేనా షాపు వాడు మొహం మీద అన్నాడు.నాకు సిగ్గుతో తల కొట్టినట్లు అనిపించి కొద్దిగా దూరంగా నించున్నాను."ఏంటండీ మీరు ,కొనేటప్పుడు అన్ని చూసి కొనాలి కదా ,ఊరికే ఇవ్వట్లేదుగా!"  ఫ్రెండ్ పట్టించుకోకుండా డ్రెస్ కు బిల్ వేయమంది .ఇదైనా కొంటారా లేక మళ్ళీ మారుస్తారా   వెటకారంగా అన్నాడు షాప్ అతను.ఇద్దరు ముగ్గురు నవ్వారు..నాకు తలకోట్టేసినట్లు అనిపించింది .నా ఫ్రెండ్ పట్టించుకోకుండా బిల్లు కట్టి వచ్చేసింది.

ఎందుకన్ని మార్చడం విసుగ్గా అన్నాను.బోలెడు డబ్బులు పోసి కొన్నపుడు అలా అన్నీ పట్టించుకుంటే తరువాత బాధ పడాలి అంది .తన డ్రెస్ తో పోలిస్తే నా డ్రెస్ ఖరీదు ఎక్కువ ,అంత గొప్పగా అనిపించలేదు .అలా అని షాపులో అలా మాటలు అనిపించుకోవడమూ నచ్చలేదు .వెదవ మొహమాటానికి  పోకుండా ఉంటే నేనూ నచ్చినది కొనుక్కునేదాన్నేమో? కాని అలా ఎప్పటికీ  చేయలేనేమో ?

ఇంతకూ   తను కరెక్టా నేను కరెక్టా?

  

4 comments:

Anonymous said...

ఇది చాల చిక్కు ప్రశ్న. మన మన్స్తత్వం పై ఆధార పడి వుంటుంది.
ఆమే కరెక్ట్...

మధురవాణి said...

నాకూ ఇలాంటి అనుభవమే ఉంది ఒక ఫ్రెండుతో! :) దాదాపు షాపులోవన్నీ చూసాం ఒక పూటంతా కూర్చుని.. మీ ఫ్రెండులా అతి సహజంగా అలా చేయగలిగితే, ఆ చేసే క్రమంలో ఎవరేమన్నా నిజంగా పట్టించుకోకుండా ఉండగలిగితే.. అది కరక్టే! అలాంటివి ఇబ్బందికరంగా ఫీలయ్యే మీరు ఇలా చేయడమే కరెక్ట్!
ఒకవేళ మీ ఇద్దరూ మీ మీ స్వభావాలకి విరుద్ధంగా చేసుంటే ఖచ్చితంగా చాలా బాధపడి ఉండేవారు! కాబట్టి ఇద్దరూ కరక్టే! :)
కన్ఫ్యూజ్ చేయలేదు కదా నేను? ;)

సత్య said...

వాస్తవానికి షాపు యజమానులు కూడా ఒక్కోసారి మన మొగమాటాన్ని కాష్ చేసుకుంటారు.
అలాగే కొందరు షాపు యజమానులకు పరీక్ష పెడుతుంటారు...కొందరు లైట్ గా తీసుకుంటారు.
కొందరు ’ఓ రాయి వేసి చూద్దాం ’ అనే కాన్సెప్ట్ ని నమ్ముతారు.... ఇక్కడ ఎవరిదీ తప్పు కాదు.

నాకైతే విండో షాంపింగ్ అన్నా ఇష్టముండదు...
డబ్బుల్లేకుండా షాపుల్లో దూరడం,
ప్రిపరేషన్ లేకుండా ఇంటర్వూలకెల్లడం,
పరిజ్ఞానం లేకుండా చర్చల్లోకి దిగడం ... నావల్ల కాదు.

షాపింగ్ విషయం లో నేనొక ఉపాయాన్ని అనుసరిస్తా, ముందు ఎవరైనా పిలిస్తే వారికి తోడుగా షాపింగ్ వెలతా ఏమైనా నచ్చితే డబ్బులున్నప్పుడు నేరుగా వెళ్ళి ఐదు నిమిషాలలో పూర్తి చేసుకొనొస్తా. ఈ పద్దతి నాకు బాగా అబ్బుతుంది!.

sneha said...

అజ్ఞాత గారు ,మధురవాణి గారు,సత్య గారు
మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.అవునండి ఎవరి మనస్థత్వం మేరకు వాళ్ళు ప్రవర్తిస్తే మంచిదేమో