Wednesday, 23 February 2011

ఎలా నమ్మేది ?

"నాకు చదువంటే చాలా ఇష్టం అండి,బాగా చదువుతాను కూడా .కానీ కానీ నా పేదరికం నాకో  శాపం"  అతను అటు తిరిగాడు  కళ్ళ లో నీరు కనబడకుండా . మా క్లాస్ రూం లో సూది వేస్తే వినిబడేఅంత నిశ్శబ్దం.అందరం జాలిగా చూసాం. ఈ సంవత్సరం తో చదువు పూర్తి అవుతుంది.అన్ని దానాల లో కంటే విధ్యా  దానం గొప్పది  మీరు పెద్ద మనసు చేసుకుంటే!!!! అతను అడగడానికి సిగ్గు పడుతూ ఆగాడు.మాట పూర్తి కాక మునుపే అందరం అపర దాన కర్ణికల్లా  విరివిగా దానం చేసాము.

ఆ తరువాత మూడేళ్ళ తరువాత ఫ్రెండ్ చెల్లెను కలవడానికని వెళ్లి తన క్లాస్ రూం లోనే వెనుక బెంచ్లో కూర్చుంటే అదే వ్యక్తి   చెప్పడం మొదలుపెట్టాడు.
"నాకు చదువంటే చాలా ఇష్టం అండి,బాగా చదువుతాను కూడా .కానీ కానీ నా పేదరికం నాకో  శాపం"  అతను అటు తిరిగాడు  కళ్ళ లో నీరు కనబడకుండా . ఆ  క్లాస్ రూం లో సూది వేస్తే వినిబడేఅంత నిశ్శబ్దం.అందరూ  జాలిగా చూసారు . ఈ సంవత్సరం తో చదువు పూర్తి అవుతుంది.అన్ని దానాల లో కంటే విధ్యా  దానం గొప్పది  మీరు పెద్ద మనసు చేసుకుంటే!!!! అతను అడగడానికి సిగ్గు పడుతూ ఆగాడు.

అప్పట్లో అతను వెళ్ళిపోగానే రెండు రోజులు తీవ్రంగా బాధ పడ్డాను ,పాపం ఇలాంటి వాళ్ళను దేవుడు ఎందుకు కష్టపెడతాడు ?అని .ఇలా మోసం చేస్తున్నాడు అని తెలియగానే బాధగా  అనిపించింది .

ఆ తరువాతోసారి గుడి దగ్గర ఒక ఆమె పెద్దగా ఏడుస్తుంది. ఎవరో బస్ లో మత్తు కలిపిన ఫ్రూటి ఇచ్చి  ఆమె పర్స్,బేగ్,చేతి గాజులు  దొంగిలించారట .ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవు .ఆకలేస్తుంది సహాయం చేయండి అని అర్ధిస్తుంది.అందరూ వింటున్నారుగాని ఎవరూ సహాయానికి ముందుకు రావడం లేదు.నాకూ అర్జెంట్  పని ఉంది .అందులోనూ ఇలాంటి వారు నిజమో అబద్దమో తెలియదు . సహాయం చేయగలిగే శక్తి ఉండి కూడా ఏదైనా తినమని పది రూపాయలు చేతిలో పెట్టి వచ్చేసాను. అప్పటి నుండి ఎక్కడికన్నా ఒంటరిగా వెళ్లినపుడల్లా  ఆమె గుర్తు వస్తుంది.ఒకవేళ ఆమె చెప్పేది నిజమైతే ?? ఎంత ఘోరమైన పరిస్థితిలో ఆమెను వదిలేసాను అనిపిస్తుంది ..

ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజులు .  

3 comments:

చెప్పాలంటే...... said...

naadi ade paristhiti mi laane

పరిమళం said...

"ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజులు"
నిజమేనండీ ...నేనూ ఇలాగే చాలాసార్లు మోసపోయాను మూర్చ రోగినంటూ , అనాధనంటూ ,చదువుకుంటున్నానంటూ .......ఇలా ..మీరు బాధపడకండి ఎప్పటిలాగే సహాయం చేయండి ఎందుకంటే కొంతమందికి నిజంగానే సహాయం అవసరం .అందుకే 99 శాతం అబద్దమై ఉండొచ్చు కాని ఒక్క శాతం నిజమైతేనో అన్న ఆలోచనతో ఉన్నపుడే మానవత్వం మనగలుగుతుంది.

sneha said...

పరిమళం గారు మీరు చెప్పింది అక్షరాలా నిజం
చెప్పాలంటే గారు :)