Thursday, 24 February 2011

పత్ర విలాపం













ఆకలేసే వేళ అరటి ఆకును
తాంబూల సేవనలో తమలపాకును

ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూరను
మండుటెండను మరిపించే విసనకర్రను

పూజ చేయి వేళ బిల్వ ఆకును
పూజలందుకునే వేళ తులసి ఆకును

తలదాచుకోనేందుకు తాటి ఆకును
పవళించే వేళ   కొబ్బరాకును

ఔషధాలలో పనికొచ్చే వేప ఆకును
పరిమళానికి సాటి లేని మరువపాకును

పండగ కళ  తెచ్చే మామిడాకును
పండిన చేతులకు గోరింటాకును

రంగులో ,రూపం లో ,సొగసులో,హొయలు లో
నా వెనుక పుట్టిన పూబాలల   కన్నా
ఎందులో తక్కువ? నేనే కదా మిన్న?

ఇంతులకు   నేనంటే ఎందుకంత   చిన్న చూపు 
పుష్పాల పై నేమో తరగని వింత కైపు

12 comments:

మధురవాణి said...

భలే భలే! బాగుంది మీరు పలికించిన పత్రవిలాపం! :)

లత said...

చాలా బావుందండీ

sneha said...

మధుర వాణి గారు ,లత గారు ధన్యవాదాలు

సుమలత said...

very nice.....

sneha said...

sumalata gaaru thank you

Anonymous said...

super gaa undandi..

sneha said...

thanks andi

మంచు said...

Chaala baavundi :-)

సత్య said...

ప్చ్....ఇది కవితయితే, బాగుంది అని అనలేను..

sneha said...

మంచుగారు ధన్యవాదాలు.
సత్య గారు ఇది కవిత అని చెప్పలేను.మనసులో భావాలు అంతే.పూల పై ఉన్న ఇష్టం ఆకుల పై చూపం అనే చిన్న ఆలోచన . మీరు ఆకు పై కవితలకు ఆహ్వానం పంపారు .చాలా సంతోషం .

సత్య said...

సంతోషం...మరి మంచి కవిత రాసి పంపండి.

చెప్పాలంటే...... said...

చాలా బావుంది