Saturday, 19 February 2011

నువ్వంటే చిరాకు

చెప్పేది వినడమే కాదు మాట్లాడటం కూడా  చేతకాని నువ్వంటే చిరాకు
నవ్వించడమే కాదు నవ్వడం కూడా రాని నువ్వంటే చిరాకు

వెక్కిరించడమే తప్ప ఓదార్చడం అంటే తెలియని  నువ్వంటే నిజంగా చిరాకు
నువ్వేంటో అర్ధం కావు ఎవరినీ  అర్ధం చేసుకోవు అందుకే మరీ చిరాకు

నీ పొగరు,కోపం,నిర్లక్ష్యం  అన్నీ నాకు చిరాకు చిరాకు చిరాకు

నీ మీద ఇష్టాన్ని చంపుకోవడానికి  ఎన్ని కారణాలు వెతుక్కున్నా
మరింతగా పెరిగిపోతున్న నీ ఆలోచనలు అంటే నాకు చిరాకు పరమ చిరాకు



6 comments:

కావ్య said...

హ్మ్ చిరాకు ఓకే .. కాని ఎం చేస్తాం ..

ఎదుటి వాళ్ళకి అర్ధం కాకపోతే .. అనవసరంగా మన మనశ్శాంతి పోతుంది ..

ప్రేమకి ఎవరైనా లొంగుతారు .. సో మీరు చిరాకు పాడడం మానేయ్యండి .. అప్పుడు ఏమైనా చేంజ్ ఉంటుందేమో చూద్దాం :)

sneha said...

:)

మధురవాణి said...

అయితే చివరికి ఏంటంటారూ? చిరాకులోంచి కూడా ప్రేమ వస్తుందంటారా.. లేక ప్రేమలోంచి కూడా చిరాకొస్తుందంటారా? ;)
బాగా రాశారు. నాకు నచ్చేసింది. :)

sneha said...

మధురవాణి గారు ప్రేమంటూ పుట్టాకా చిరాకు, పరాకు అని ఎన్ని కారణాలు వెతుక్కున్నా ఎదుటి వ్యక్తి ని మర్చిపోలేము అని అభిప్రాయం ;)కవిత నచ్చినందుకు ధన్యవాదాలు

చెప్పాలంటే...... said...

baavundi mi chiraaku kavita -:)

sneha said...

cheppaalante ధన్యవాదాలు