Saturday, 5 March 2011

నా మొదటి కధ (పెళ్లిచూపులు -ఆఖరి బాగం )

చీకట్లు ముసురుకుంటున్నాయి మెల్లగా .చాలా మంది వెంట తెచ్చుకున్న రాత్రి భోజనాలు కానిస్తున్నారు. . మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదేమో బాగా ఆకలి వేస్తుంది.అతను కూడా ఏమీ తెచ్చుకోలేదనుకుంటా కళ్ళు మూసుకుని పడుకున్నాడు  .ట్రైన్లో మీల్స్ వస్తే ఆర్డర్ చేద్దాం అనుకున్నాగాని ఎవరూ రావడం లేదు. ఈ రోజేమయ్యిందో ఏమో అందరూ ఇలా ఏడిపిస్తున్నారు చిరాగ్గా తిట్టుకున్నాను .ఏదో స్టేషన్ వచ్చింది ..అక్కడక్కడా షాపులు ..ప్రాణం లేచోచ్చినట్లు అయ్యింది .కొద్దిగా కోలాహలం గా ఉంది...నేను లేచాను క్రిందకు దిగడానికి .మళ్ళీ ఏమీ దొరకకపోతే కష్టం ."ఎక్కడికి ?"అతను అడిగాడు. ఇతనికి ఎందుకు చెప్పాలి ?అయినా ఏమిటా ప్రశ్న ?విసుగ్గా అనుకుంటూ  సమాధానం చెప్పకుండా ముందుకి కదల బోయాను.ఎవరో అయిదుగురు ఆరుగురు చాలా లగేజ్ తో ఎక్కారు .అవి సర్దడానికి దారికడ్డంగా నించుని కదలడం లేదు . 

తనే మళ్ళీ ...."క్రిందకు వెళ్ళాలా? ఇక్కడ ట్రైన్ ఎక్కువ సేపు ఆగదు "అన్నాడు మెల్లిగా .నా ఎదురుగా ఉన్నవాళ్ళను తప్పించుకుని క్రిందకు వెళ్లి వచ్చేంత సమయం ఉండదని అర్ధం అయి మళ్ళీ  నా సీట్లో కూర్చున్నాను ."ఏం కావాలి చెప్పండి నేను  తెస్తాను" అన్నాడు మృదువుగా ..అతనలా మాట్లాడుతుంటే మనసు లాగేస్తున్నట్లు ఉంది .ఎందుకింత శ్రద్ద చూపిస్తున్నాడు .ఏమీ లేదన్నట్లు మొహం  అడ్డంగా ఊపాను.ఏమనుకున్నాడో తను  వాళ్ళను తప్పించుకుని  బయటకు వెళ్ళాడు . "ఎక్కడికి ?" ఈ సారి నేను అడగాలనుకున్న మాట పెదవి దాటలేదు. కాని ఈ స్టేషన్లో ఎక్కువ సేపు ఆగదు అన్న అతని మాటలు గుర్తొచ్చి  భయం గా అనిపించింది .కిటికీ లో నుండి బయటకు చూసాను  తను కనబడతాడేమో అని .ట్రైన్ మెల్లగా కదలడం మొదలు పెట్టింది.ఎక్కడకు వెళ్ళాడు ? సామాన్లు సర్దుకునేవాళ్ళ హడావుడి తగ్గింది .ట్రైన్ వేగం పుంజుకుంది .అయ్యో ,ఇంకా రాలేదు తన బేగ్ కూడా ఇక్కడే ఉండిపోయింది .పరుగున తలుపు దగ్గరకు వెళ్లాను .ఎప్పుడో ప్లాట్ ఫాం దాటేసింది ట్రైన్ ..చిమ్మ చీకటి ..ఏమీ కనిపించడం లేదు . ఇప్పుడెలా ? చైన్ లాగేస్తే ? ఏమైనా గొడవ అవుతుందా?


కళ్ళకు సన్నటి నీటి పొర అడ్డుపడుతుంది   తెలియకుండానే ...టిక్కెట్ తనదగ్గరే ఉందా? డబ్బులు ఉన్నాయో లేవో ?వెళ్ళద్దని  అప్పుడే చెప్పాల్సింది  .పంతంగా ఆగిపోయాను .నన్ను నేను తిట్టుకున్నాను ...అంతలోనే ఉహుహు  అంత  చనువు మా మధ్యలేదు అందుకే ఆగిపోయాను సర్ది చెప్పుకున్నా ..మరి నేను దిగుతా అన్నపుడు తను అడిగాడుగా ?ఏమిటో అయోమయం .ఇప్పుడేం చేయాలి .? "హలో! ఇక్కడేం చేస్తున్నారు  అక్కడ కనిపించక పోయేసరికి భయం వేసింది కిందకు దిగారేమో అని " అన్నమాటలకు గిరుక్కున వెనక్కుతిరిగాను . అతన్ని చూడగానే ఆ చెంపా ఈ చెంపా వాయిన్చాలన్న కసి వచ్చేసింది .మెల్లిగా కంట్రోల్ చేసుకుంటూ" మీరెక్కడికి వెళ్ళారు నాకు వెళ్ళద్దని  చెప్పి "అన్నాను కోపంగా నా సీట్లో కొచ్చి కూర్చుంటూ ."అంటే ...టైం అయ్యింది.. మీకు ఆకలి వేస్తుందేమో అని" అన్నాడు చేతిలో ఏవో పెకేట్స్ వాటర్ బాటల్స్ చూప్తూ .నేనేం మిమ్మల్ని అడగలేదే విసురుగా అన్నాను.తనేం మాట్లాడలేదు .ఇద్దరం పావుగంట కిటికీ నుండి బయటకు చూస్తూ కూర్చున్నాం.


ఏవేవో ఆలోచనలు.ఎందుకని అతని పై అంత కోపం అంత ఉక్రోషం వస్తుంది? .మాట్లాడాలని అనిపిస్తుంది .వద్దని అనిపిస్తుంది .ఇంకా అతనిని ఇష్టపడుతున్నానా? తప్పు కదా ?అతనికి పెళ్లి కుదిరిపోయి ఉంటుంది ...ఒక వేళ కాకపొతే ? అయినా సరే ఎలా ఇష్టపడతాను ? ఒక సారి ఛీ అన్నాకా? ఒక వేళ తల్లిదండ్రుల బలవంతం మీద వద్దన్నాడేమో ? అంత భయపడేవాడు మళ్ళీ ఎందుకు ఈ నాటకాలు ?అంత శ్రద్ద చూపడాలు?ఒకవేళ నా ప్లేసులో ఇంకో అమ్మాయి ఉంటే ఇలాగే చేస్తాడా?అతని సంగతి సరే ..మరి ఇంత ఇష్టపడిన నేను చేసిన పనేమిటి?తను క్రింద ఉండిపోతే చైన్ లాగడానికి కూడా  భయ పడ్డాను ...ఆలోచించాను.. ఇదే నేనే క్రింద ఉండి పోతే తనేం చేసి ఉండేవాడు ? ఇవన్నీ సరే ...నిజంగా నాకు అతని పై కోపం ఉందా?నిజంగా మాట్లాడాలని లేదా ? మరెందుకని  ఇంత పంతం  ?  కాసేపు మాట్లాడుకోవడానికి కూడా ఎందుకు ఇంత ఆలోచన ? ఏదో తప్పు చేసినట్లు? అన్ని కోల్పోయినట్లు ఇలా మౌనంగా ?నన్ను నేను మోసం చేసుకుంటూ..కొద్ది సేపు కూడా నాకు నచ్చినట్లుగా ఉండలేనా? ఇంకేం ఆలోచించ బుద్ధి వేయలేదు .


"ఆకలి వేస్తుంది తిందామా? "నా ప్రశ్నకు ఉలిక్కిపడి లేచాడు తను .."ఏం తెచ్చారు?" చొరవగా తన దగ్గర పెకేట్స్ ఓపెన్ చేసి చూసాను ...ఇడ్లీ ..వేడిగానే ఉన్నాయే ..."ఎక్కడ తెచ్చారు ?మరి నాకు కనబడలేదు ఇందాక చూసినపుడు ."నేను ఉన్నట్లు ఉండి గలగలా మాట్లాడేస్తుంటే  అయోమయంగా చూడటం తన వంతైంది ...మాటలలో పడటం వల్లనేమో ఇందాకటి కోపం చిరాకు అన్ని పోయాయి .ఏదో స్నేహితునితో మాట్లాడుతున్నట్లు మళ్ళీ మునుపటి పావనిని అయిపోయాను .మీరు చెప్పిన పుస్తకం కొద్దిగా  చదివాను బాగుంది అన్నాను ..చిన్నగా నవ్వాడు.."వెన్నెల్లో గోదావరి అంత బాగుంటుందా? "అన్నాను ."చాలా  బాగుంటుంది  ..ఓ సారి ఫ్రెండ్ తో"... తను ఇంకేదో చెపుతుంటే ఆపుచేసి .." ఏం వెన్నెల్లో కృష్ణ ,వెన్నెల్లో యమునా,వెన్నెల్లో తుంగబధ్ర బాగోవా " అన్నాను . "అబ్బా అర్ధం అయ్యింది  వదిలేయండి ప్లీజ్ .." అని
నవ్వాడు.ఎందుకనో అతనిని అలా ఏడిపించడం సరదాగా అనిపించింది . సాహిత్యం, రాజకీయాలు ,ఉద్యోగం ఇలా  మా కబుర్లు చాలా సేపు సాగాయి. టైమవుతున్న కొద్ది జనాలు లైట్లు ఆపు చేసి నిద్రపోవడానికి రెడీ అవుతున్నారు . అంతకు  ముందు టీసి వచ్చినపుడు వేరే సీట్ దొరుకుతుందేమో అని అడిగి చూసాం .కాని లేవు.

అలసిపోయి ఉన్నానేమో నిద్ర వచ్చేస్తుంది.నా ఆవలింతలు గమనించగానే నేను మధ్యాహ్నం పడుకున్నాను .మీరు పడుకోండి కాసేపు .అతను లేచాడు ."లేదు పర్వాలేదు ..నాకు కూర్చుని నిద్రపోవడం అలవాటే "అన్నాను మొహమాటంగా .కానీ  కూర్చుని ఎలా పడుకోవాలో తెలియడం లేదు అలా అని అతన్ని ఇబ్బంది పెట్టడమూ ఇష్టం లేదు . అతను చిన్నగా నవ్వుతూ "మీరు పడుకోండి .నేను డోర్ దగ్గర కాసేపు ఉండి వస్తాను" అన్నాడు .అలాక్కాదు ."కాసేపు ఆగి మీరు నన్ను నిద్రలేపండి ప్లీజ్" అన్నాను నాకేందోకో చాలా మొహమాటంగా అనిపించింది .'సరే' అని తను వెళ్ళిపోయాడు .బేగ్ క్రిందకు దించి దుప్పటి తీశాను .

మంత్రమేసినట్లు ఎలా నిద్రపోయానో మధ్యలో ఓ సారి మగతగా మెలుకువ వచ్చింది . తను నా కాళ్ళ దగ్గర తగలకుండా కూర్చున్నాడు. ఇందాక నేను ప్రక్కన పెట్టి వదిలేసిన పుస్తకం తన చేతిలో .గాలి ఎక్కువ వస్తున్నట్లు ఉంది కిటికీ తలుపులు వేసేసాడు. చాన్స్ దొరికితే తాకాలని చూసే ఈ రోజుల్లో అతని ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా అనిపించింది.మళ్ళీ ఎలా నిద్ర పట్టేసిందో రివ్వున చల్లగాలి మొహానికి కొడితే మెలుకువ వచ్చింది .కళ్ళు తెరవగానే ఎదురుగా  అతను నా మొహం వైపే చూస్తూ.."క్షమించండి  ..ఎలా లేపాలో తెలియక కిటికీ తలుపు తెరిచాను "అన్నాడు. "సారీ బాగా మొద్దు నిద్ర చేసాను కదూ ...మీరు పడుకోండి అన్నాను లేచి  కూర్చుంటూ ".. "పడుకోవడమా?తెల్లవారిపోతుందండి ...ఇంకొక గంటలో మీ ఊరు వచ్చేస్తుంది "అన్నాడు నవ్వుతూ.మనసంతా దిగాలుగా అయిపొయింది.ఇంకొక గంటలో అతనెవరో నేనెవరో .పిచ్చా నీకు మనసు ఒక ప్రక్క తిడుతుంది.

మా మాటలకు పడుకున్న వాళ్ళెవరో కొద్దిగా ఇబ్బందిగా కదిలారు."హే మర్చిపోయాను డోర్ దగ్గర మాట్లాడుకుందామా? మీకొకటి చూపించాలి "అన్నాడు .సరే అని లేచాను .."ఈ చీకటిలో ఏమి చూపిస్తారు" చలికి చున్ని వొళ్ళంతా కప్పుకుంటూ అన్నాను ."అలా చూస్తూ ఉండండి మరి అన్నాడు " బయటకు చూస్తూ  .ట్రైన్ శబ్దంలో ఏదో మార్పు .ఏదో బ్రిడ్జ్ మీదనుండి వెళ్ళుతున్నట్లుగా   లైట్ల కాంతిలో కనబడుతుంది. గాలి మరింత చల్లగా ,ఒక రక మైన నీటి హోరు .గోదావరి నది .మనసంతా తీయగా, తనువంతా హాయిగా నిండైన  గోదావరి. అప్రయత్నంగా ముందుకి వచ్చాను .ఉన్నట్లు ఉండి ఏదో గుర్తువచ్చి "మీ దగ్గర డబ్బులున్నాయా? "అన్నాను ..."ఏం? ఎంత? "అన్నాడు అయోమయంగా చూస్తూ .."ప్లీజ్ కోయిన్ ఇవ్వండి "అన్నాను చిన్నపిల్లలా గెంతుతూ ..అతనికి అర్ధం అయినట్లు ఉంది తీసి చేతికి ఇచ్చాడు .గోదావరిలో విసిరి  దణ్ణం పెట్టుకున్నాను ."చిన్నపుడు అమ్మమ్మ తో వెళ్ళినపుడు ఇలానే చేయించేది ,బోలెడు పుణ్యం అంట" అన్నాను నవ్వుతూ ."ఇది మరీ బాగుంది డబ్బులు నావి పుణ్యం మీదీనా "అన్నాడు తనూ నవ్వుతూ  . "వెన్నెల్లో గోదావరి చూపించమంటే చీకట్లో గోదావరి చూపించేవాళ్లకు  అంతే మరి " అన్నాను ఉడికిస్తూ . ఇద్దరం గట్టిగా నవ్వుకున్నాం అయిదు నిమిషాలు .


"ఇంకో అరగంటలో మీ ఊరు వచ్చేస్తుంది సామాను సర్దుకోవాలేమో మీరు" అన్నాడు మెల్లగా ."ఊ సర్దుతా" అన్నాను పొడిగా ..మనసంతా బాధ.అతనికేమి అనిపించడం లేదా? ఇంకా నచ్చలేదా నేను ? తన వైపు చూసాను .సీరియస్ గా బయటకు చూస్తున్నాడు."ఒక విషయం అడగచ్చా? "అన్నాను సంశయిస్తూనే . చెప్పండి అన్నాడు." మీరు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు ? "అన్నాను తడబడుతూ .. అతను చురుగ్గా నా కళ్ళల్లో చూసాడు ."అంటే,అలాక్కాదు మీకు పెళ్లి కుదిరింది అని అన్నారు గణపతి గారు అప్పట్లో ఇంకా ఎందుకు చేసుకోలేదా అని" ప్రశ్న పూర్తికాగానే గుండెల్లో దడ దడ మంది ... నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నానా? మనసులో పదే పదే అనుకున్నాను.."ఆ ప్రశ్న నేనూ అడగాలేమో ...మీకు ఎవరితోనో పెళ్లి కుదిరింది ఇంకేదో సంబంధం ఉంది చూడమని బలవంతం చేసాడు కాని  ఇంకెవరినీ చూడాలనిపించలేదు... "అన్నాడు నెమ్మదిగా ...


నాకు అయోమయంగా అనిపించింది.అర్ధం అయ్యి కానట్లు... అంటే మధ్యలో ఎవరో ఏదో చేసారు .. "లేదు మేము అలా అనలేదు తేరుకుంటూ" అన్నాను కంగారుగా.. "సరేలెండి ఇప్పుడు  కుదిరిపోయిందిగా..అడ్వాన్స్డ్  కంగ్రాట్స్ " ... ఇక బయలుదేరండి ఇంకో పదినిమిషాలు ఉంది అంతే అంటూ మా సీట్ దగ్గరకు నడిచాడు. ఏడుపొచ్చేసింది..ఇందాక కోపం లో పెళ్లి కుదిరిపోయింది అని చెప్పిన మాటలు నిజమని నమ్మేసాడు. ఏం చేయాలి? కాదు అని చెప్తే ? ఏమనుకుంటాడు ?చులకన అయిపోతానా?  మెల్లిగా కళ్ళు తుడుచుకుని బేగ్లో దుప్పటి సర్దుకుని కూర్చున్నాను . చెప్పాలనిపిస్తుంది మళ్లీ చెప్తే ఎలా స్పందిస్తాడో తెలియక భయం వేస్తుంది .


ఆసరికే ట్రైన్ లో అందరూ హడావుడిగా లేచి అటు ఇటు తిరుగుతున్నారు. చెప్పేస్తే? "అది మరి" ..ఏదో చెప్పబోయాను  .."ఒక్కరే వెళ్ళాలా? ఎవరైనా వస్తున్నారా మీ కోసం" అతను అడిగాడు.."లేదు నేనే వెళ్ళాలి "..."కాని"... నా మాట పూర్తి కాకుండానే "ఇంకా కొద్దిగా చీకటిగానే ఉంది.పరవాలేదా ?అయినా ఇంకో పది నిమిషాల్లో తెల్లవారిపోతుంది అనుకోండి "అన్నాడు బయటకు చూస్తూ.. ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో తెలియడం లేదు ..ట్రైన్ కూత వినబడుతుంది స్టేషన్ లోకి వచ్చేసినట్లు .రండి అంటూ నా బేగ్ పట్టుకుని డోర్ దగ్గరకు వెళ్ళాడు .చాలా మంది దిగుతున్నారు.మెల్లిగా అతని వెనుకనే నడిచాను. క్రిందకు దిగాకా' ధేన్క్స్ ' అన్నాను ఏం అనాలో తెలియక ..మనసు చెప్పెయమని తొందర చేస్తుంది.ఏదో బెరుకు అడ్డం వచ్చేస్తుంది .అతను సారీ నాకు ఇష్టం లేదు అంటాడేమో అని.


"వెళ్తాను" ..చెప్పి వెనుకకు తిరిగాను .అప్పటివరకు అదిమిపెట్టుకున్న కన్నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి ..అయిపొయింది.వెళ్ళిపోతున్నాడు .ఇక మళ్లీ కలవము ..ఇంతే ఇక ..ఈ మాత్రందానికి ఎందుకు మళ్ళీ కలిపాడు దేవుడు ..ట్రైన్ కదులుతున్న  శబ్దం ....వెళ్ళిపోతుంది ట్రైన్  .... తప్పు చేసానా? మనసులో మాట చెప్పకుండా తప్పు చేసానా ? లాస్ట్ వరకూ తనే చెప్తాడని ఎదురు చూస్తూ తప్పు చేసానా? ఒక వేళ చెప్పి మళ్ళీ ఇష్టం లేదని అనిపించుకుంటే తట్టుకోగాలిగేదాన్నా? చెప్పకుండా మాత్రం ఉద్దరించింది ఏముంది .మళ్ళీ ఎన్నాళ్ళు మధనపడాలో.. ఎందుకురా నా జీవితంలోకి వచ్చావ్? నేనేం తప్పు చేసాను?ఎందుకిలా జరుగుతుంది నాకే   నడుస్తున్న కొద్ది ఏదో నీరసం.. కాళ్ళల్లో సత్తువ లేనట్లు పడిపోతానేమో అనిపిస్తుంది . 

ఇంకా నన్ను చూస్తున్నాడా?చూస్తే గనుక  ఇంకొక్క చాన్సే ఉంది .వెనక్కి పరిగెత్తి అతనికి చెప్పేస్తే? చెప్పేయి పావని ఆలోచించే టైం లేదు, ఎవరో హెచ్చరిస్తున్నట్లు."వేణూ" అరుస్తూ వెనక్కి త్రిగాను ...ట్రైన్ ఎప్పుడో ఫ్లాట్ ఫాం దాటేసింది .అయినా పిచ్చిదానిలా పెరిగేట్టాను ట్రైన్ కోసం  .కళ్ళు తిరుగుతున్నాయి ఎవరినో బలం గా గుద్దాను.పడిపోయానా? లేదు ఎవరి చేతుల్లోనో పదిలంగా.మెల్లగా ఈ లోకంలో .ఎదురుగా వేణు.కలా ?నిజమా?"పావనీ " ఆదుర్ధాగా నా మొహంవంకే చూస్తూ కుదుపుతున్నాడు. 


నేను చూడగానే ...నా కళ్ళలోకి చూస్తూ  "పావనీ నువ్వంటే ప్రాణం నాకు .ఆ పెళ్లి వద్దని చెప్పెయవా !ప్లీజ్ రా  నువ్వులేకపోతే నేను ఉండలేను. పెళ్లి చూపులకు ముందే నువ్వు నాకే సొంతం అనేసుకున్నా. మీరు వేరే సంబంధం కుదుర్చుకున్నారని చెప్పినపుడు ఎంత ఏడ్చానో తెలుసా.నా పావని ఇంకెవరికో సొంతం అయిపోతుంది అంటే తట్టుకోలేకపోయాను .ఇక నావల్లకాదురా బంగారం.ఇది తప్పయినా సరే .ఆ పెళ్లి వద్దని చెప్పెసేయి " .నేను ఇన్నాళ్ళు పడ్డ వేదన అంత తన మాటల్లో  ....నా మనసును కాపీ కొట్టేసినట్లు అచ్చంగా అలాగే . ..తను ఇంకా ఏదో చెప్తున్నాడు  . నేను అడ్డు చెప్పలేదు వింటూనే  ఉన్నాను  మరింత దగ్గరకు చేరి  అతని యదసవ్వడి తో పాటుగా ... మెల్లగా నా తల ఎత్తి "ఇదేమిటి కన్నులో గోదావరా" అన్నాడు కన్నీరు తుడుస్తూ నవ్వుతూ.తన మాటలకు నవ్వుతూ అవును "ఆనంద గోదావరి" అన్నాను  .

24 comments:

తృష్ణ said...

well written...very touching.wishing more...:)

శిశిర said...

చాలా బాగా రాశారు. కథ బాగుంది. మీ నుండి వచ్చే మరిన్ని రచనల కోసం ఎదురు చూస్తూ...

sharanya said...

super ga rasaru andi

మంచు said...

Excellent అంటే సరిపొదేమో....అంత బాగుంది ... క్లైమాక్స్ లొ వేణూ చేత చెప్పించడం ఇంకా ఇంకా బాగుంది. ఒక్క స్ట్రెచ్ లొ మూడూ బాగాలు చదివేసాను.
ఇప్పుడు మళ్ళీ ఇంకొసారి చదవాలి :-)

మీ తరువాతి కధ ఎప్పుడు? :-)))

జయశంకర్ said...

చాలా చాలా బాగుందండి. పరకాయ ప్రవేశం చేసినట్టుగా ఎంత చక్కగా రాసారో.. :) నా అదృష్టం కొద్ది మూడు భాగాలు మీరు పోస్ట్ చేసిన తరువాత చదివాను.. లేకుంటే తరువాత ఏమయ్యిందో తరువాత ఏమయ్యిందో అంటూ గడపాల్సి వచ్చేది..

డేవిడ్ said...

చాలా బాగుంది...మనసుని హత్తుకునేలా.

sneha said...

తృష్ణ గారు ధన్యవాదాలు
శిశిర గారు నచ్చినందుకు థేంక్స్ అండి
శరణ్య గారు ధన్యవాదాలు

sneha said...

మంచుగారు ధన్యవాదాలు,ఇంకా ఏమి అనుకోలేదండి.ఇదేదో సరదాగా రాసాను అంతే
జయ శంకర్ గారు ధన్యవాదాలు అండి .కధ రాయగలనో లేదో అని ప్రయత్నించాను.నచ్చినందుకు సంతోషం
డేవిడ్ గారు ధన్యవాదాలు

కొత్త పాళీ said...

sweet.
a bit cinematic, but quite good.

కావ్య said...

స్నేహ చాల బాగా రాసారు .. రియల్లి సుపర్బ్ .. :) నేను అయితే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ మిస్ అయిపోతుందో అని టెన్షన్ పడ్డా .. యు ఆర్ గ్రేట్ :)

Ennela said...

బాగుందండీ.. బాగా వ్రాసారు..

sneha said...

కొత్తపాళిగారు థేంక్స్ అండి.కనీసం కధలో అయినా కలిపేయమని ఒక ఫ్రెండ్ అంటే కలిపేసా.అందుకే కొంచెం నాటకీయత జోడించాను
కావ్యా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు .మీ కధలు చదివాను .బాగా రాస్తున్నారు .
వెన్నెల గారు ధన్యవాదాలు

లత said...

మూడు భాగాలూ చదివానండీ బాగా రాశారు

శివ చెరువు said...

Very very nice..

sneha said...

లత గారు ధన్యవాదాలు
శివగారు ధన్యవాదాలు

డేవిడ్ said...

అదేంటి స్నేహ గారు...రియల్ లైఫ్ లో వాళ్ళు ఇద్దరు ఒకటి కాలేదా?

గిరీష్ said...

nice narration

sunita said...

బాగుందండీ. బాగా వ్రాసారు!!

sneha said...

డేవిడ్ గారు జీవితం కధ కాదు కదండి :)
గిరీష్ గారు థేంక్యూ

పానీపూరి123 said...

> నా మొదటి కధ (పెళ్లిచూపులు -ఆఖరి బాగం )
చాలా బాగా రాశారు, ఆ తరువాత ఎన్నిరోజులకి పావనికి, వేణు కి పెళ్ళి అయిందో లేదో చెప్పలేదు?

sneha said...

వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు అందుకే చెప్పలేదండి :)

Raj Potluri said...

Good one, well written...

why twist in the end when everything is going fine??(above comment)

sneha said...

రాజ్ గారు ఈ కధ కొంత నిజం కొంత కల్పన పూర్తి నిజం కాదు .

మధురవాణి said...

నేను కూడా లక్కీగా అన్నీ భాగాలు రాసేసాకా చదివాను. లేకపోతే టెన్షన్ తో చచ్చేదాన్ని.. :P
చాలా చాలా బాగా రాశారు. నాకీ కథ ఎప్పటికీ గుర్తుంటుందేమో.. అంటే చాలా చాలా నచ్చినట్టేగా అర్థం.. :)