Wednesday, 9 March 2011

బాలాజీ-భక్తుని సరదా సంవాదం

మామూలు సమయాల్లో మర్చిపోయి మనకి కష్టాలు వచ్చినపుడు మాత్రం భగవంతునిని తెగ ధ్యానం చేసి తలుచుకున్టాము కదా . అప్పుడు స్వామీ వారు భక్తులతో ఇలా అంటారట .


భక్తుడు : స్వామీ డబ్బులేదు అప్పుల పాలైపోయాను నువ్వే దిక్కు నా కష్టాలన్నీ తీర్చు
బాలాజీ : నాయనా నేనే పెళ్ళికోసం కుభేరుని వద్ద అప్పు తీసుకుని ఇంకా వడ్డీ కడుతున్నాను.నన్ను అడుగుతున్నావా ?


భక్తుడు :స్వామీ నా భార్య గయ్యాళి .ఈ బాధను భరించలేకున్నాను .ఏదైనా దారి చూపు .
బాలాజీ: నీవు ఒక్క భార్య తోనే తిప్పలు పడుతున్నావు.మరి నాకిద్దరు .నేనెవరికి చెప్పుకోవాలి .

భక్తుడు : స్వామీ పెద్దగా కష్టాలేమీ లేవుగాని ఆఫీసుకి బస్సుల్లో ఆటోల్లో వెళ్ళడం కష్టం గా ఉంది త్వరలో ఒక కారు కొనేలా ఆశీర్వదించు
బాలాజీ.: నేనే నడిరాత్రి అలివేలు ను చూడటానికి కాలి నడకన కొండ దిగుతాను ఇక నిన్నేమి ఆశీర్వదించను?
భక్తుడు : స్వామీ సకల సంపదలు ఉన్నాయి కాని నిద్ర లేమితో బాధ పడుతున్నాను .ఎన్ని మందులు మింగిన పలితం ఉండటం లేదు .నువ్వే దిక్కు
బాలాజీ: నిద్ర సంగతి నన్నేం అడుగుతావులే .అర్ధరాత్రి వరకు నైవేద్యాలు ,అష్టోత్తరాలు,షోడశోపచార పూజలు ,దర్శనాలతో ఒంటికాలి పై నిలబెడుతున్నారు .కాసేపు పడుకుందామని కనులు మూయగానే వెనువెంటనే సుప్రభాతాలు ,మేలుకొలుపులు .నాకెవరు దిక్కు ?


భక్తుడు :స్వామీ చిన్న వయసు అప్పుడే బట్ట తల వచ్చేస్తుంది .జుట్టు ఊడకుండా ఏదైనా ఉపాయం దొరికే మార్గం చూడు
బాలాజీ : నన్నే అడిగావా ! నా జుట్టు కోసమేగా నీల తన నీలాలు నాకర్పించింది .ఆమె నీలాలను తిరిగి మామూలు రూపం తీసుకురావడానికి మీ అందరి తల నీలాలను ఇప్పటికీ తీసుకుంటున్నాను .నేనేమి చేయలేనయ్యా .
(ఎప్పుడోఏదో పుస్తకంలో  చదివాను.)

6 comments:

Vamsikamal said...

baagundi

ఇందు said...

హ్హహ్హహా! ఫన్నిగా ఉన్నా కొన్ని నిజాలు ఉన్నాయ్! ;) నైస్ పోస్ట్ స్నేహాగారు!! :)

శివ చెరువు said...

:)

డేవిడ్ said...

నైస్... బాగుంది స్నేహ గారు

గాయత్రి said...

hahhahaha...bagundi

sneha said...

వంశికమల్ గారు ధన్యవాదాలు
ఇందుగారు ధన్యవాదాలు
శివగారు ధన్యవాదాలు
డేవిడ్, గారు ధన్యవాదాలు
గాయత్రి గారు ధన్యవాదాలు