Thursday, 17 March 2011

నా రెండవ కధ(ఆఖరి భాగం )

ఫోన్ నాలుగైదు సార్లు రింగయ్యి ఆగిపోయింది ...అయినా భయం తగ్గలేదు ...ఫోన్ వైరు లాగేసి క్రింద పడేసి సోఫాలో ముడుచుకుని  కూర్చున్నాను .ఇంట్లో వాసు లేడు కాబట్టి సరిపోయింది ఉంటే ఏమయ్యేది.ఈ రోజంటే నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది రేపటి సంగతి ఏమిటి ?ఎన్నాళ్ళు ఈ గొడవ ?ఏం చెయ్యాలి ?అలా ఎంతసేపు కూర్చున్నానో తెలియదు .ఎవరో తలుపు కొడుతున్న శబ్దం .గుభేలు మంది .ఈ టైమ్లో ఎవరు?కొంపదీసి  వచ్చేసాడా ఇంటికి .మెల్లగా తలుపుదగ్గరకు వెళ్లి కిటికీ లో నుండి బయటకు చూసాక గాని వొణుకు తగ్గలేదు .పక్కింటి పద్మ వాళ్ళ అబ్బాయి. "ఆంటీ! నీకు ఫోన్ ..అమ్మ పిలవమంది" అన్నాడు.నాకా?ప్రక్క వాళ్ళ నెంబర్ కూడా తెలుసుకున్నాడా? నోరు తడారిపోతూ ఉంటే ప్రక్కింటికి పరుగు పెట్టాను ..
 నన్ను చూడగానే పలకరింపుగా నవ్వి" మీ వారు కాల్ చేసారు మీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట మీరు" అంది.ఆ చెప్పడంలోనే ఏం చేస్తున్నావ్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అనే ప్రశ్న అంతర్లీనంగా ఉంది .. మెల్లగా ఊపిరి పీల్చుకుని ' హలో 'అన్నాను."ఎక్కడికి వెళ్లావు ఇందాక నుండి కాల్ చేస్తున్నా .ఎంత భయం వేసిందో తెలుసా" అన్నాడు కోపంగా .. "అంటే అది.. స్నానానికి వెళ్లాను"  అన్నాను నెమ్మదిగా .. "సరే ..ఇంకా పని అవ్వలేదు ఇంకో రోజు ఉండాల్సివస్తుందేమో ,మేక్జిమం రావడానికి చూస్తాను సరేనా" అన్నాడు  .'ఊ 'అన్నాను ...నాకు దుఖం తో గొంతుకు పూడుకు పోతుంది ...వాసు తొందరగా వచ్చేయవా అని చెప్పాలని ఉందికాని పద్మ నన్నే చూస్తుంది ఎదురుగా నించుని ...ఫోన్ పెట్టేసి వెంటనే ఇంటికొచ్చేసాను..
ఆ రాత్రి అస్సలు నిద్రపోలేదు. ఇక ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ..లేకపోతే ఈ టెన్షన్ తో ఏమైపోతానో అనిపించేసింది..ప్రొద్దున్న సంధ్యకు కాల్ చేసి ఈ రోజు ఆఫీస్ లో లీవ్ పెట్టి మీ ఇంటికి వచ్చేస్తాను ..మాట్లాడాలి అని చెప్పి సంధ్య ఇంటికి వెళ్లాను ... "సంధ్య ఇక నావల్ల కాదు వాసుకి నాకు నేనుగా చెప్పెయడమే బెటర్ ..లేకపోతే నేనేదో ఇన్నాళ్ళు దాచేసాను అనుకుంటాడు .ఇక వేరే దారి లేదు "అన్నాను ఏడుస్తూ ..." అదికాదే , రాజేష్ క్లోజ్ ఫ్రెండ్ మా అన్నయ్యకు బాగా తెలుసు. నేను ఇప్పటికే తనని అడిగాను రాజేష్ ఎక్కడున్నాడు ఏంటి?వివరాలు కావాలని  . సాయంత్రం చెప్తాను అన్నాడు ..ఇన్నాళ్ళు ఎలాగూ ఆగావు ఈ ఒక్క రోజు ఆగు వివరాలు తెలిసాక ఆలోచిద్దాం "అంది. "తెలుసుకొని మాత్రం ఏం చేస్తాం?  .అతను అడ్రెస్స్ కూడా ఇచ్చాడుగా "అన్నాను అయోమయంగా ."నీకు చెప్తే భయపడతావని చెప్పలేదుగాని నాకింకో డవుట్ వస్తుందే "అంది మెల్లగా .".నువ్వలా టెన్షన్ పెట్టకే నాకు వణుకొస్తుంది .ఇంకేం డవుట్ అన్నాను భయంగా ..అబ్బే ,కంగారు పడకు డవుట్ అంతే ,నిజం అవ్వాలని కాదు . రాజేష్ విషయం తెలుసుకొని.. అదేదో సిన్మాలోలా ఇదంతా మీ ఆయన చెయ్యడం లేదుగా అంది నావైపు చూస్తూ .
నాకు నోట మాట రాలేదు కాసేపు తేరుకుని "ఇదేంటే అలా అంటావ్ .మా ఆయన ఎందుకలా చేస్తాడు" అన్నాను అయోమయంగా ."అహ..అలా చేస్తాడని కాదు . ఆ ఒక్క అనుమానం మాత్రం ఎందుకు .ఈ రోజు సాయంత్రం తెలిసిపోతుందిగా .అప్పుడు చెప్పేద్దువుగాని "అంది మెల్లగా . కాసేపు వరకూ ఏమీ మాట్లాడలేదు .ఇలా కూడా అయ్యే చాన్స్ ఉందా? తెలిసి వాసు నాటకం ఆడుతున్నాడా ?ఇదంతా తెలియకా నేను టెన్షన్ అనుభవిస్తుంటే నవ్వుకున్టున్నాడా? ఆ రోజు కావాలనే టేబుల్ పైన లెటర్ నాకు కనబడేలా పెట్టాడా? నిన్నరాజేష్ లా గొంతుమార్చి మాట్లాడి తరువాత  కావాలనే ఫోన్ చేసి ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని తిట్టాడా? లేదు వాసు అలాంటివాడు కాదు .విషయం తెలియగానే మొహం మీద అడిగేస్తాడు తప్ప ఈ నిఘాలు పెట్టడు..కాని తను అలా చేసి ఉంటే ఏమి చేయాలి?ఎంత అవమానం. మళ్ళీ తనతో ఇంతకు ముందులా ప్రేమగా ఉండగాలా? కోపం ,బాధ కలగలిపి వచ్చేస్తున్నాయి.. వాసు అలా  చేసాడో ,లేదో  తెలియకుండానే ఇంత బాధ పడుతున్నాను.మరి నేను ఎవరినో ప్రేమించాను అని తెలిస్తే వాసు ఏం చేస్తాడు?  ఎన్నెన్నో అనుమానాల మధ్య ఎక్కడో ఆశ ..వాసుకేం తెలియదు .నా  వాసుకేం తెలియదు .. సంధ్య  ఎంత ధైర్యం చెప్పుతున్నా అక్కడున్నంత సేపూ  ఇవే ఆలోచనలు ..
డాక్టర్ దగ్గర అపాయంట్ మెంట్ ఉన్నాసరే వెళ్ళ బుద్దికాలేదు ...ఎలా వచ్చానో తెలియదు ఇంటికి ..తలుపు తాళం తీసి ఉంటే భయంగా తలుపు తోసుకుని  లోపలికి వచ్చాను ..ఎదురుగా వాసు ...' వాసూ!!'  పరిగెత్తుకుని అతని చేతుల్లో వాలిపోదాం అనుకున్నా గాని తన చూపుల్లో ఏదో తేడా ...కోపం ,అసహనం,ఇంకా ఏదో తెలియదు ... "ఎక్కడికి వెళ్ళావ్?" తన మాటల్లో పదును కలుక్కున గుచ్చుకుంది ."అది .. ఆఫీస్కి ...వంట్లో బాగోక పోతేనూ" .... ఏదో చెప్పబోతుంటే "మీ ఆఫీస్కి కాల్ చేసాను లీవ్ పెట్టావంటా "అన్నాడు నా వైపు సూటిగా చూస్తూ..
తనలా అడుగుతుంటే భయం తో చమటలు పట్టేసి అరచేతులు చల్లగా అయిపోవడం మొదలు పెట్టాయి.ఒక్కో పదం కూడబలుక్కుంటూ  "సంధ్య ..మీకు తెలుసుగా సంధ్య... తనకి బాలేదు అందుకని  లీవ్ ...."నా మాట పూర్తి కాకుండానే ఎందుకు నాకు చెప్పలేదు ఇన్నాళ్ళు   " అన్నాడు కోపంగా.. ఏ ..ఏంటీ ?అన్నాను తడబడుతూ .. లోపలకు వెళ్లి వచ్చాడు కోపంగా .. బీరువాలోని లెటర్స్ ,మెడికల్ రిపోర్ట్స్ ఎప్పుడుతీసాడో తెలియదు ..నేల కేసి కొడుతూ" ఎందుకు చెప్పలేదు నాకు" అన్నాడు ..అయిపొయింది ..తెలిసిపోయింది.. ఇంక ఏం చెప్పినా వినడు ..నాకు కాళ్ళు తేలిపోతున్నట్లు అనిపిస్తుంది ..."నేను చాలా రోజుల నుండి గమనిస్తున్నాను నిధి .ఎందుకు ఇలా తయారయ్యావో తెలియడం లేదు.నేనేం తక్కువ చేసాను నీకు" ...తనమాటలు నూతిలోనుండి వస్తున్నట్లు వినబడుతున్నాయి..ఏం జరుగుతుంది నాకు ?ఏదో అవుతుంది ...తల విపరీతంగా తిరుగుతుంది... "నాకు చాలా విషయాలు చెప్పకుండా  దాచేస్తున్నావు ..ఎందుకిలా చే..." ఆ తరువాత ఏమయ్యిందో తెలియదు ...
కళ్ళు మెల్లగా తెరిచాను ...తల భారంగా అనిపిస్తుంది ... ఎదురుగా సంధ్య ..నన్ను చూడగానే ఇప్పుడెలా ఉంది ఆందోళనగా అంది. వాసు...  వాసు ఏడి ?అన్నాను ఓపిక తెచ్చుకుని .. "డాక్టర్ ఏవో మందులు తెమ్మనమని చెప్పారు  తీసుకురావడానికి వెళ్ళారు" అంది. నేను ఏడుస్తూ "సంధ్యా !! అయిపొయింది .. వాసుకి తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయింది ..ఇక నాకు సుఖం ఉండదు" ..దుఖం తో గొంతు పూడుకుపోయి మాట పెగలడం లేదు .. "ఏంటి తెలిసేది నీ మొహం...నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టేసావ్..అసలేమీ జరగలేదు "అంది ప్రేమగా నా తల నిరుముతూ .. నేను అయోమయం గా చూసాను.."అవునే పిచ్చీ ...విషయం  వింటే మంచం ఎక్కి గెంతులేస్తావ్.."అంది నవ్వుతూ. ఏంటే,సరిగ్గా చెప్పు నాకేం అర్ధం కావడం లేదు అన్నాను విసుగ్గా.
 "విషయం ఏమిటంటే మీ ఇంటికి ఉత్తరం రాసింది నువ్వు ప్రేమించిన రాజేష్ కాదు ,మీ ఆయన చిన్ననాటి ఫ్రెండ్ రాజేష్ అట ..మీ ఆయన పేరు శ్రీని వాస్ కదా ..అతను కూడా  మీ  ఆయన్ని 'శ్రీ 'అనే పిలుస్తాడట.. పాపం ఎప్పటి నుండో  తనకోసం ప్రయత్నించి అడ్రెస్స్ పట్టుకుంటే నువ్వు అవన్నీ దాచేసావు ..ఆఖరికి ఫోన్ చేస్తే పెట్టేసావు ..".అంది నవ్వుతూ ."నిజమా" అన్నాను నమ్మలేక చూస్తూ .."ఇక ఈ రోజు మీ ఆయన ఇంటికి రాగానే  నర్స్ కాల్ చేసింది అట నీకోసం... ఈ రోజు అపాయింట్ మెంట్  ఉంది అంటగా నీకు .. పాపం ,నర్స్ చెప్పిన విషయం వినగానే తనకి ఏమి అనాలో అర్ధం కాక ,ఎందుకు నువ్వు ఈ విషయం దాచావో తెలియక విషయం తెలుసుకుందామని నీ బీరువాలో ఏమయినా మెడికల్ రిపోర్ట్స్ దొరుకుతాయేమో వెదుకుతుంటే నువ్వు దాచిన లెటర్స్ కనబడ్డాయట..దానితో తన ఫ్రెండ్ కి కాల్ చేస్తే ..ఆ అబ్బాయి లెటర్స్ వేయడం ,తను ఫోన్ చేస్తే నువ్వు పెట్టేసి మళ్ళీ  లిఫ్ట్ చేయకపోవడం అన్నీఒక్కొక్కటిగా  తెలిసాయట....ఒక్క సారిగా ఇన్ని షాక్ లు తట్టుకోలేక ఆఫీస్కి కాల్ చేస్తే మరొక షాక్ "లీవ్" పెట్టడం తెలిసింది ..ఈ లోపల నువ్వు ఇంటికి రావడం ..నిన్ను అడుగుతూ ఉంటుండగానే కళ్ళు తిరిగిపడిపోవడం అన్ని జరిగిపోయాయి ..అసలు నిజానికి ఇన్ని షాక్స్ విన్నాకా మీ ఆయన పడిపోవాలి ..పాపం నువ్వు ఆయనకు ఆ చాన్స్ కూడా ఇవ్వలేదు అంది "నవ్వుతూ ...నాకేదో ఇంకా కలలో ఉన్నట్లుగా ఉంది .."ఇదంతా నిజమే !మరి ఆ రాజేష్ ఈ రాజేష్ ఒకటికాదా" అన్నాను ఇంకా అపనమ్మకంగా ..
"కాడుగాక కాడు..నువ్వెళ్ళగానే అన్నయ్య నాకు కాల్ చేసాడు ..ఆ రాజేష్ అసలు ఇండియాలో లేడట.. అమెరికాలో సెటిల్ అయిపోయాడట.పెళ్లి అయిందట ఒక బాబు కూడా .నువ్వనుకున్నంత దుర్మార్గుడెం కాడు ..కాబట్టి నువ్వు భయపడకు.. పాపం మీ ఆయన్ని చూస్తే జాలేస్తుంది ...అసలేం జరిగిందో తెలియకా, ఏం చేయాలో తోచకా వెంటనే నాకు కాల్ చేసారు .ఎందుకని తను అంత డల్ గా ఉంది ..మీరు కనుక్కోండి ..నేను మొన్న ఊరికే కొద్దిగా తిట్టాను ..తను ఇంత మనసులో పెట్టేసుకుంటుంది అనుకోలేదు అని పాపం తెగ ఫీల్ అవుతున్నారు "అంది నవ్వుతూ..ఆ మాటలకు వాసు మీద ప్రేమ అమాంతం పొంగింది .."సంధ్యా! చెప్పేస్తాను జరిగిందంతా వాసుకి ...పాపం తనని మోసం చేయడం ఇష్టం లేదునాకు.ఇష్టం అయితే కాపురం చేస్తాడు లేదంటే ....." ఇంకేమనాలో తెలియక  ఆగిపోయాను ."అదే  వద్దు అనేది .చూడు నిధి ఇదేం సినిమాకాదు శుభం కార్డ్ పడగానే అంతటితో అయిపోవడానికి..తరువాత కూడా గడపాల్సిన  జీవితం చాలా  ఉంటుంది.అదెప్పుడో తెలియని వయసులో జరిగిపోయింది.దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తావు. చెప్పడం వల్ల లాభం లేకపోగా క్రొత్త భయాలకు అనుమానాలకు తెర తీసినట్లు అవుతుంది..అనవసరంగా నువ్వు మనసు కష్టపెట్టుకుని తనను బాధ పెట్టకు.అర్ధం అయ్యిందా" అంది . నేను ఆలోచనలో పడ్డాను  ....ఈ లోపల వాసు రావడం తో తను మళ్ళీ వస్తాను ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది..
వాసు నా ప్రక్కనే కూర్చుని తల నిరుముతూ" సారీరా.. నిన్ను చాలా బాధ పెట్టాను .ఇంకెప్పుడు అలా తిట్టను... అయినా కోపం వస్తే నాలుగు తిట్టాలిగాని అలా మనసులో పెట్టేసుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటావా...పైగా ఈ  సమయంలో  ....అయినా ఇంత సున్నితం ఏమిటిరా నువ్వు ... నాకు తెలియక ఇలాంటి టైం లో నిన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయాను ...తిండి కూడా సరిగ్గా తిని ఉండవు  " అన్నాడు ... తన చేతిని గట్టిగా పట్టుకుని ముద్దు పెడుతూ  వాసూ ఇంకెప్పుడూ నిన్ను బాధ పెట్టాను నా మీద కోపం వస్తే  నన్ను వదిలి వెళ్ళవు కదూ అన్నాను కన్నీళ్ళతో తడిపేస్తూ..పిచ్చిదానా నిన్ను వదిలి నేను ఉండగలనా తను దగ్గరకు తీసుకున్నాడు ..
(ఈ కధకు ఏదైనా పేరు పెట్టండి ప్లీజ్ )

25 comments:

మనసు పలికే said...

హమ్మయ్య.. కలిపేశారు..:) చాలా చాలా బాగుంది కథ, కథనం:). చదువుతున్నంత సేపూ నిధి పాత్రతో పాటుగా నేను కూడా అవే భావోద్వేగాలకు లోనయ్యాను. అంతలా ఆకట్టుకుంది మీ కథ..
Its simply superbbbbb :)

సాధారణ పౌరుడు said...

చాలా మంచి కథలు రాస్తున్నారు. కానీ జరిగిణడనిని మొగుడికి చెప్పటం మొదట చేయాలిసిన పని, అలా క్లోస్ చేస్తే బావుండేదేమో.

sneha said...

మనసుపలికే గారు మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి

సాధారణ పౌరుడుగారు మీరు చెప్పిన పోయింట్ చాలా సేపు ఆలోచించేను ..భర్తకు చెప్పేసి కధను సుఖాంతం చేసేయడం రొటీన్ గా చాలా కధల్లో వచ్హ్చేదే..కాని నిజ జీవితానికి అన్వయిస్తే ,నేనే సంధ్య ప్లేస్ లో ఉంటే అవసరం లేని టాపిక్ ని పిలిచి భర్తకు చెప్పి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పేదాన్నేమో..మీరైతే మీ స్నేహితురాలికి ఏమని చెప్తారు :)

తృష్ణ said...

కాసేపు ఉండి తొలగిపొతుంది కానీ ఉన్నంత సేపూ ఏమీ కనపడనివ్వదు కాబట్టి కథకు "పొగమంచు" అని పెడితే ఎలాఉంటుందంటారు? లేక మరీ అందంగా ఉండాలంటే ఇంకేదైనా చూడండి..:)

మనసు పలికే said...

స్నేహ గారూ.. నాకో డవుట్..;) కథల వెనకాల లాజిక్కులు ఆలోచిస్తున్నానని తిట్టుకోకండి ప్లీజ్..:)
లెటర్ వచ్చినప్పుడు అది ఎవరి పేరు మీద ఉందో చూడలేదా నిధి..?

రాణి said...

కథ బావుంది :)
అందరూ చదివేశాక పేరు అవసరమా :P

sneha said...

తృష్ణగారు పొగమంచు బాగుంది అండి ..మీరు చెప్పిన అర్ధమూ బాగుంది
నిన్న మందాకిని గారు కూడా చెప్పారు రెండుపేర్లు..
మనసుపలికే గారు ..అరెరె మర్చిపోయాను ..రాసినపుడు ఈ విషయం గుర్తొచ్చింది..దానికి ఏదో ఒక రీజన్ ఇరికించేద్దం అనుకున్నా మర్చిపోయాను ... సరేలేండి మన నిధి కంగారు అమ్మాయి అందుకే పట్టించుకోలేదని సర్ధుకుపోండి :)
రాణి గారు అంతేనా :D

శివ చెరువు said...

nicely carved climax..

'Padmarpita' said...

బాగుంది కథ, కథనం..2:)

మంచు said...

హమ్మయ్యా... మమ్మల్ని ఎక్కువ రొజులు టెన్షన్ పెట్టలేదు.. థాంక్యూ... మిగింపు బాగుంది .. మీ కథల్లొ ముఖ్యంగా నచ్చేది .. ఆ పాత్రలు తమలొ తాము అలొచించుకుంటూ ప్రశ్నించుకుంటారు చూడండి ..

(ఉదాహరణకి : "లా కూడా అయ్యే చాన్స్ ఉందా? తెలిసి వాసు నాటకం ఆడుతున్నాడా ?ఇదంతా తెలియకా నేను టెన్షన్ అనుభవిస్తుంటే నవ్వుకున్టున్నాడా? ఆ రోజు కావాలనే టేబుల్ పైన లెటర్ నాకు కనబడేలా పెట్టాడా? నిన్నరాజేష్ లా గొంతుమార్చి మాట్లాడి తరువాత కావాలనే ఫోన్ చేసి ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని తిట్టాడా? లేదు వాసు అలాంటివాడు కాదు .విషయం తెలియగానే మొహం మీద అడిగేస్తాడు తప్ప ఈ నిఘాలు పెట్టడు..కాని తను అలా చేసి ఉంటే ఏమి చేయాలి?ఎంత అవమానం. మళ్ళీ తనతో ఇంతకు ముందులా ప్రేమగా ఉండగాలా?" ))

ఈ ప్రశ్నలు, అలొచనలు భలే ఉంటాయి... పాత్రల్లొకి పరకాయ ప్రవేశం చేసి రాస్తున్నారనిపిస్తుంది...

డేవిడ్ said...

స్నేహ గారు కథ బాగుంది..మీరు రాస్తున్న విధానం ఇంకా బాగుంది.

మంచు said...

ఇక సాధరణ పౌరుడు గారి కామెంట్ కి... కథల్లొ ఎమో కానండీ ప్రాక్టికల్ గా అలొచిస్తే చెప్పక పొవడం బెటర్ చాయిస్ అండి.. స్నేహ గారు చెప్పినట్టు... అది అప్పటితొ వదిలిపొదు... ఆ చెప్పిన వాళ్ళ నిజాయితిని మెచ్చుకుని ఆ విషయం శాస్వతం గా మర్చిపొయే ఐడియల్ జీవిత భాగస్వాములు (ఆడ అయినా మగ అయినా) తక్కువ అని నా అభిప్రాయం... అలా అని ఎప్పుడూ ఇదే పట్టుకుని సాదిస్తారు అని కాదు... ఆ విషయం అంత త్వరగా మర్చిపొరు అని...

మర్చిపొకుండా మనసులొ దాగిఉన్న ఇలాంటి విషయాలు సాధారణంగా బయటకు రావు కానీ.. ఎప్పుడు గొడవ అయినప్పుడు , కొపం లొ ,మాట మాట పెరిగి ఉక్రొషం లొ అనాలొచితంగా " నువ్వు మాత్రం తక్కువా... చిన్నప్పుడు ఇలా చెయ్యలేదా" అని అనేస్తారు... అది అప్పుడు విన్నవాళ్ళకి మాత్రమే కాదు కొపం తగ్గాక అది అన్నవాళ్ళకి కూడా మనస్సు చివుక్కుమంటుంది...

అందుకే లేని పొని గొడవలు , రిస్కులు ఎందుకు అని సంధ్య చెప్పింది సబబు అనిపిస్తుంది. సంధ్య స్తానం లొ నేను ఉన్నా 99% అలాగే చెప్తాను అనుకుంటున్నా :-))

కావ్య said...

హహ స్నేహ .. సూపర్ లే .. అసలు నువ్వు .. చాలా బాగుంది .. కధకి పేరు .. "సంఘర్షణ" అని పెట్టచ్చు .. "మనసు మాట వినదు" అని పెట్టచ్చు :) హహ .. సరదాగా చెప్పాను

అప్పు ఫీల్ అవ్వాలమ్మ లాజిక్లు లాగకూడదు :p

గిరీష్ said...

well narrated..
పెళ్ళైన ఒక వనిత పడే మనోవ్యధని బాగా రాసారు.
అంతరంగాలు పేరు బాగుంటుంది. నేను పూర్తిగ చూసిన ఒకే ఒక సీరియల్ :)

శిశిర said...

మీ కథనం చాలా బాగుంది. కథ చెప్పేయడమే కాకుండా పాత్రల ఆలోచనలూ, సంఘర్షణలు చాలా బాగా చెప్తారు మీరు. నాకు అది బాగా నచ్చుతుంది.

Anonymous said...

కధ గురించి చెప్పడానికి ఏమిలేదు ఇక్కడ అందరూ చెప్పేసారు కాని మరీ ఇంత సస్పెన్స్‌ పెట్టారు చూడండి చాలా నచ్చింది అది.

"నేనేంటి? ఈ బ్లాగ్ రాయడం ఏంటి?"
:) :) ట్యాగ్ లైన్ బావుందండి

sneha said...

శివ గారు ధన్య వాధాలు
పద్మార్పితగారు ధన్యవాదాలు
మంచుగారు ధన్యవాధాలు ప్రధమ పురుషలో కధ రాస్తే భావోధ్వేగాలు బాగానే రాయగలం .తృతియ పురుషలో రాయడం కష్టం ( నా విషయంలో) ఈ సారి అలా ట్రై చేయాలి :)
డేవిడ్ గారు ధన్యవాదాలు

sneha said...

కావ్య నచ్చినందుకు ధన్యవాదాలు.కధ పేరు కూడా బాగున్నాయి.. పేర్లు పెట్టడం లో నేను పూర్ ని
గిరిష్ గారు ధన్యవాదాలు అంతరంగాలు మొత్తం చూసారా ఈ టివిలో వచ్చేది అదేనా? అదే పూర్తిగా చూసారా
శిశిరగారు థేంక్యూ :)
నో నేం గారు హమ్మయ్య మొదటిసారి బ్లాగ్ పేరుని మెచ్చుకుంది మీరే థేంక్యూ థేంక్యూ

Ennela said...

నిదానమే ప్రధానము అని నేను అన్నీ అయ్యేదాకా ఆగి చదివాను .హమ్మయ్య...నొ టెన్షన్, నొ సస్పెన్స్..కథ మాత్రం సూపర్...కథ పేరు :-'పేరు లేని మంచి కథ"

గిరీష్ said...

haa.. ade..adi kakunda inko antharangala, inka anthe nenu ma intlo.. :)

sneha said...

ఎన్నెల గారు ధన్యవాధాలు :)
గిరీష్ గారు ఆ అంతరంగాలు పూర్తిగా చూసినందుకు మీకు తప్పక అవార్డ్ ఇవ్వాల్సిందే

గిరీష్ said...

మొదట కొన్ని ఎపిసోడ్స్ చూసాను, ఆ తర్వాత మిగతావి చూడవలసి వచ్చింది :)

sneha said...

girish gaaru :D:D:D

మధురవాణి said...

కథ సూపర్ గా రాసారు. :)
ఇక పోతే ముగింపు గురించిన ప్రశ్న.. నిజం గా బయట గతం గురించి చెప్పాలా వద్దా అని.. హుమ్మ్.. ఇది ఎవరికి వారు నిర్ణయించుకోడం కరక్ట్ అనుకుంటాను. ఈ కథ సందర్భమే తీసుకుంటే సమస్య ఎక్కడ రావొచ్చంటే, నిధి ఈ విషయం ఎప్పుడో చెప్పేసి ఉంటే అది వేరేగా ఉంటుంది. అలా కాకుండా, ఇన్నాళ్ళు తెలియని ఆ విషయం ఇప్పుడు మళ్ళీ రాజేష్ ఉత్తరం రాయడం వల్ల బయట పడితే అది నిధికీ, వాసుకీ ఇద్దరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది..

Vicky said...
This comment has been removed by the author.