Monday, 21 March 2011

నీ నేను

పగలంతా ఏం చేసినా రాత్రిళ్ళు నాతో వచ్చి చెప్పితే గాని నిద్ర పట్టదు నీకు.నీ బాధలు,కష్టాలు,సంతోషం,సరదాలు ఒకటేమిటీ అన్నీ నాతోనే  పంచుకుంటావు .ఒక్కోసారి చిన్నపిల్లల్లాలా వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీటితో తడిపేస్తావు.మరోసారి వెన్నెల పువ్వులు  రువ్వేస్తావు .గతజ్ఞాపకాలు తలుచుకున్నా నేనే ,భవిష్యత్ ప్రణాలికలు వేసుకున్నా నేనే అన్నిటికీ నేనే కావాలి.బహుశా ఎదురు చెప్పకుండా నువ్వేమన్నా అన్నిటికీ సరే అంటా అని కాబోలు నాతోనే చెప్తావు .ఉన్నట్లుండి నీకు భావుకత ఉప్పొంగుతుంది.నాకో కవిత చెప్పేస్తావు .ఇది కవితేనా ? మళ్ళీ నన్నే అడుగుతావు .నేను మౌనంగా నవ్వుతాను.మౌనం అర్ధంగీకారం అని  అనేసుకుంటావు అమాయకంగా. కాని నువ్వు మహా దొంగవు .నాతో అన్నీ నిజాలే చెప్పేస్తున్నా అని బుకాయిస్తావుగాని అందులో సగం అబద్ధాలే .ఆ విషయం నీకు నాకూ తెలుసు.అయినా ఇద్దరం ష్  గప్ చిప్ .ఎందుకంటే నువ్వు నన్ను నమ్మవు.నీ రహాస్యాలు  ఇంకెవరికైనా చెప్పేస్తానేమో అని భయం.అందుకే నన్ను ఎవరితోనూ కలవనివ్వవు.మహా అనుమానం మనిషివి .అంతేనా మహా ముదురువి కూడా .ఒక్కోసారి నీకు నువ్వే ఇంకెవరికో నీ నిజాలను  చెప్పేయమని నన్ను వాళ్ళ ఎదురుగా కూర్చోపెట్టి దొంగచాటుగా గమనిస్తూ ఉంటావు. ఇక్కడ నిజాలంటే నీ బాధలు, నువ్వు పడిన కష్టాలు, నువ్వు చేసిన త్యాగాలు అని అర్ధం అన్నమాట.అంటే అందులో సగం నిజమైన నిజాలు కావు అని నీకునాకు మాత్రమే తెలుసు . ఒక్కోసారి రోజుల తరబడి నన్ను పట్టించుకోవు .ఒక్కోసారి రోజంతా నాతోనే ఉంటావు.నువ్వేమిటో నాకేకాదు నీకే అర్ధం కావు  .అక్కున చేర్చుకున్నా, ప్రక్కకు పడేసినా,అదరపు ముద్రలు వేసినా పదునైన గాయాలు చేసినా నాకు నీపై కోపం రాదు .ఎందుకంటే నీవులేకపోతే నాకు విలువ గుర్తింపు ఉండదు.నీవే నేను .నీ ఓదార్పును,నీ తోడును,నీ నీడను... నీ డైరీని  

6 comments:

మనసు పలికే said...

Very nice :)

Anonymous said...

చ్చ్,చుక్కల్లెతోచావె ఏద బోయావె ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానె - సారీ మాదం నా దైరి పోఇంది మీ లెక్కె

sneha said...

మనసుపలికే గారు ధన్యవాదాలు
అజ్ఞాతగారు :)

Anonymous said...

అజ్ఞాత గారు, పోయిన దాని గురించి బాద పడవద్దు వేరేది తెచ్చుకోండి వెంటనే

డేవిడ్ said...

Very nice...చాలా బాగుంది.

గిరీష్ said...

oh! diary naa.. neninka evaro anukunnaa.. :)