Thursday, 24 March 2011

కొండవీటి దొంగ-కోటలో రాణి

నేను అసలు టివీ చూడను.బుద్ది తక్కువ అయి,ఖాళీ ఎక్కువ అయ్యి  ఈ మధ్య కొండవీటి దొంగ-కోటలో రాణి అనే ఒక చెత్త ప్రోగ్రాం చూసాను యూ ట్యూబ్లో .ఇప్పటివరకూ విమర్శలు అందుకున్న ప్రోగ్రాంలు సీరియల్స్ ఒక ఎత్తు అయితే ఈ చెత్త ప్రోగ్రాం ఒక్కటీ ఒక ఎత్తు.ప్రొగ్రాం మొదటి బాగం చూసినపుడే మనకు విరక్తి వెల్లువలా వస్తుంది.

టూకీగా చెప్పాలంటే పదిమంది అభం శుభం తెలియని గిరిజన యువకులను తీసుకొచ్చి వాళ్ళను రకరకాలుగా బాధలు పెట్టి మనల్ని ఎంటెర్టైన్మెంట్ చేయడం .వాళ్ళు అమాయకులు డబ్బాసో పట్నం మీద ఆశక్తో ఏదో ఒకటి ఆశ చూపి 60 రోజులు వాళ్ళ ఇళ్ళకు దూరంగా తీసుకొచ్చి మన ముందు పడేస్తారు .

షో యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటయ్యా అంటే ఈ గిరిజనులను పది మంది అమ్మాయిలకు అప్పగించి వారిని 60 రోజుల్లో నాగరికుల్లా మార్చేలా చేస్తారు.ఇందులో మళ్ళా ఎలిమినేషన్లు  వగైరాలు  ఉంటాయి ఎవరు చివర వరకు వస్తారో వాళ్ళన్న మాట" కొండవీటి రాజ కోటలో రాణి"
  
అసలు ప్రోగ్రాం మొదటి భాగంలో ఆ అమాయకులను పరిచయం చేసే కార్యక్రమమే విరక్తి తెప్పిస్తుంది. .. మన ఓం కార్ గారిని మించిపోయిన ఏంకర్ గారు ఒకరున్నారు ఇందులో.అతనూ ,అతని ఏంకరింగు నేను చెప్పడం కాదు మీరు చూసి తీరాల్సిందే.

అత్యంత ఆధునికమైన బట్టలు వేసుకున్న ఆడపిల్లల మధ్య నించో పెట్టి వాళ్ళను పరిచయ కార్యక్రమం మొదలవుతుంది.ఏంకర్ గారు ఒక గిరిజనుడిని పిలిచి ఒక అమ్మాయికి గాలిలో ముద్దు విసరమంటారు.అతను అయోమయంగా చూస్తుంటాడు. ఏంకర్ గారు వదలరు ఆ ముద్దుగుమ్మలను పిలిచి ఎలా ముద్దు ఇవ్వాలో నేర్ప మంటారు .మరొక అబ్బాయిని పిలిచి అతనికి  అందంగా అనిపించిన అమ్మాయికి గులాబి ఇచ్చి రమ్మంటారు.ఇంకా చేతి పై ముద్దు పెట్టమంటారు.వాళ్ళు సిగ్గుపడుతున్నా వినిపించుకోరు.ఇలాంటి వెర్రి మొర్రి చేష్టలు ఒకటా రెండా..అంతా చేస్తే ఆ పిల్లల వయసు 15-17 మధ్య ఉంటుంది


అంతటితో ప్రోగ్రాం అవ్వదు.ఒక్కో ముద్దు గుమ్మకు ఒక్కో అబ్బాయిని అప్పగిస్తారు.ఆ అమ్మాయిలకు  డబ్బులివ్వకుండా షాప్ కి తీసుకువెళ్ళి ఎవరినైనా అడుక్కుని (అంటే వాళ్ళ బాషలో ముద్దుగా బ్రతిమాలడం అన్నమాట) వాళ్ళు ఇచ్చిన డబ్బుతో వీళ్ళకు ఏదైనా కొనాలన్నమాట..అక్కడితో వదిలేస్తారా షాప్ మొత్తం తిప్పేసి వాటిలో ఉన్న వస్తువులన్నీ వివరంగా వాళ్ళకు చెప్పి తీసుకురమ్మంటారు..ఇకా ఆ అమ్మయిలను చూడాలి పెన్ను తెలియని వాళ్ళకు పెన్ డ్రైవ్ ల గురించి ,mp3  ప్లేయర్ల గురించి బహుచక్కగా వివరిస్తారు .వీళ్ళు అయోమయంగా చూస్తూ ఉంటారు . మధ్య మధ్య అడుక్కునే కార్యక్రమం సాగుతూ ఉంటుంది అనుకోండి.

మరొకరోజు ఉన్నట్లు ఉండి ఒక్క రాత్రిలో వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పే మంటారు .వీళ్ళేమో పాపం రాత్రిళ్ళు 2 వరకూ కూర్చోపెట్టేసి వాళ్ళకు వచ్చిందేదో నేర్పేస్తారు .ఆ మరుసటి రోజు ఆ పిల్లలు  ఆ ఇంగ్లీష్ రైంస్ చెప్పలేక నానా తంటాలు పడుతుంటే జడ్జ్లు లు విలాసంగా కేవలం ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ వాళ్ళ తప్పులు వివరిస్తారన్నమాట. ఒక్క జడ్జ్ తెలుగులో సరిగా మాట్లాడటం నేను చూడలేదు ఎందుకంటే మరి వాళ్ళు నాగరీకులుకదా తెలుగులో మాట్లాడితే ఇంకేమైనా ఉందా?వాళ్ళేమో నాకు తెలియడం లేదండి నాకు అర్ధం కావడం లేదండి అని ఏడుపు .

మరోసారి ఫ్యాషన్ షో.. ఉన్నట్లు ఉండి వాళ్ళను పార్లర్లకు తీసుకువెళ్ళి జుట్టును తాటి పీచులా ఎర్ర్గా మార్చేసి ,మొహాలకు ఫేషియల్స్ చేయించి పిచ్చి పిచ్హ్చి డ్రెస్స్లు వేసి వాళ్ళ తో ఫ్యాషన్ షో.అందులో ఒక అతనికి మొక్కుబడి ఉంది అట.పాపం అతను ఏడుపు .అసలే  వాళ్ళకు నమ్మకాలు ఎక్కువ .వీళ్ళు ఉన్నట్లు ఉండి అలా తల కట్ చేసేస్తే రేపు ఏదైనా అనుకోనిది జరిగినపుడు ఇదే కారణం అని బెంగపెట్టుకుంటే అది ఎవరు తీరుస్తారు?
పైగా ఆ అమ్మాయిలు మీద మీద పడిపోవడం .ఆ అబ్బాయిలు  మరీ పసికూనలు కాదుగా పైగా పెళ్ళిళ్ళు అయిన పిల్లలు ఉన్నారు అందులో.ఈ షోకులన్నీ వాళ్ళ్కు నేర్పీ కొంత డబ్బు మొహాన పడేసి ఆ అడవిలో బ్రతకమని పంపేస్తారు .ఎంత అమానుషం .

ఆ ఏంకర్ అయితే ఆడవాళ్ళతో మాట్లాడే తీరు అసలు బాగా లేదు .ఆ అమ్మాయిలను మరీ భయంకరంగా తిడుతున్నాడు.ఒక అమ్మాయి సరి అయిన డ్రెస్ ఎంపిక చేయలేదని మూడుపూటలా తిని పడుకోవడం కాదు కాస్త బుర్రపెట్టాలని తిట్టాడు .

 మరీ విన్నూత్న కార్యక్రమాలంటూ వెర్రి ప్రోగ్రాములు వేస్తున్నారు .  


6 comments:

మంచు said...

నేను ఒక ఎపిసొడ్ చూసాను. చాలా చిరాకు కలిగింది.. కాన్సెప్ట్ ఎమో కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం దారుణం.

jaggampeta said...

idhoka pichchi programme .

డేవిడ్ said...

స్నేహ గారు అవునండి నేను ఒక ఎపిసోడ్ చూశాను చాలా చెత్తగా వుంది..ఈ ప్రొగ్రాం గురించి బ్లాగ్ లో రాద్దాం అనుకున్నాను మీరు రాశారు..టీవి వాళ్ళ రేటింగ్స్ కోసం అమాయక గిరిజనులను వాడుకోవడం చాలా బాధకరం

మనసు పలికే said...

అమ్మో, ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్ ఇంత దారుణమా..? యాడ్స్‌లో చూశాను కానీ, ప్రోగ్రాం మొత్తం చూడలేదు నేను. యాడ్‌లోనే చాలా చిరాకు కలిగించింది. ప్రోగ్రాం చూసే ధైర్యం చేశారు అంటే మీరు చాలా గ్రేట్ స్నేహ గారూ..;)

డేవిడ్ said...

ఈ ప్రొగ్రాం బ్యాన్ చేయమని గిరిజన్ సంఘాల ఐక్యవేదిక వాళ్ళు ఇవ్వాల జీ టివి ముందు ధర్నా చేశారు...చూడాలి ఏమైతదో...

కావ్య said...

madam emayipoyavu ??