Monday, 7 March 2011

ఇంకొంచెం ప్రేమించుకుందాం


మన పరిచయపు తోటలో
ఎన్నెన్నో ఆనందపు పూలు
అనుభూతుల ఫలాలు
ఆశల ఆకులు
పూస్తున్నాయి,కాస్తున్నాయి ,పండుతున్నాయి

కాని కాలం గడిచేకొద్దీ  
 అనుమానపు చిగుళ్ళు తొడుగుతున్నాయి
అపార్ధాల ముళ్ళు గుచ్చుకుంటున్నాయి
ఆవేశపు తెగుళ్ళు సోకుతున్నాయి  


మరేం చేద్దాం? 
అహం అనే  కలుపును తొలగించి ,
నమ్మకపు వేళ్ళను పటిష్టంగా ఉంచడానికి
ఇంకొంచెం ప్రేమ పన్నీరును చిలకరిద్దామా???




13 comments:

చెప్పాలంటే...... said...

baavundi simple gaa

మిరియప్పొడి said...

మస్తు అండీ

కొత్త పాళీ said...

చాలా బావుంది.
ప్రేమ - తోట మెటఫర్ (రూపకాలంకారం)ని ఆద్యంతం చక్కగా నిర్వహించారు.
ఇంకొంచెం నగిషీ పెట్టేందుకు రెండు సూచనలు.
రెండో చరణంలో చిగుళ్ళు .. సాధారణంగా చిగురు అనేది కొత్త సృష్టికి, కొత్త జీవానికి కవిసమయం. క్షయం చేసే తెగుళ్ళతో ఇక్కడ దాన్ని కలపడం ఎబ్బెట్టుగా ఉంది.
మూడో చరణంలో మొదటి వరుసలో "అనే" పదాన్ని వాడనక్కర్లేదు. అప్పుడు రూపకం ఇంకా బలంగా ఉంటుంది.
పద్యం క్లుప్తంగా అందంగా చాలా బావుంది.

sneha said...

చెప్పాలంటే గారు ధన్యవాదాలు
మిరియప్పొడిగారు ధన్యవాదాలు
కొత్తపాళిగారు మీరు చెప్పిన సూచనలే రాస్తున్నప్పుడు నాకూ అనిపించింది.చిగుళ్ళు కొత్త ఆశలకు చిహ్నం కదా అది ఇక్కడ బాగోదేమో అని అయితె సరైన పదం తట్టక అలా రాసాను
అలాగే " అనే" అన్న పదం కూడా లైన్ చిన్నదవుతుందని కలిపేసాను. మంచి సూచనలకు మెచ్చుకున్నందుకు ధన్యవాదాలండి

కెక్యూబ్ said...

ప్రేమ రసాయనావసరాన్ని చక్కగా చెప్పారు. కొత్తపాళీ గారి సూచనలు పొందడం బాగుంది.. మరింత కవిత్వాన్ని మీనుండి వెల్లువెత్తుతుందని ఆశిస్తూ...

'Padmarpita' said...

చాలా బావుంది.

కొత్త పాళీ said...

నా సూచనల్ని సహృదయంతో అర్ధం చేసుకున్నందుకు నెనర్లు.
పగుళ్ళు?

డేవిడ్ said...

బాగుంది స్నేహ గారు..

sneha said...

డెవిడ్ గారు ధన్యవాదాలు
కొత్తపాళిగారు పగుళ్ళు బాగుంది కాని అనుమానపు పగుళ్ళు ఏర్పడుతున్నాయి అనాలా? ఎలా ఉంటే బాగుంటుందో కాస్త చెప్పగలరు .

sneha said...

కే క్యూబ్ గారు పద్మార్పిత గారు ధన్యవాదాలండి నచ్చినందుకు

సుమలత said...

chala bagundi.....

కొత్త పాళీ said...

అనుమానపు పగుళ్ళు బాగుంది.
ఐనా ఏమమ్మా, ఏది నప్పిందో, ఏది నప్పలేదో సూచన అంటే చెప్తాను గాని, మొత్తం రాయమంటే ఎలా? ఆ మాత్రం తెలిస్తే నేనే కవిత్వం రాసుకుందును గదా! :)

sneha said...

సుమలత గారు ధన్యవాదాలండి
కొత్తపాళి గారు :D నాకూ కవిత్వం అంటే ఎంటో తెలియదు.వచ్చిందేదో రాసేస్తున్నాను .బాగుంది అంటే సరదా వేస్తుంది :D