Friday, 1 July 2011

మువ్వలపట్టీలునా మువ్వల పట్టీలు 
నాతో సమానంగా పరుగులు పెడుతూ అల్లరి చేసేవి ..నిధానంగా నడిస్తే విచ్చినపువ్వుల్లా మెల్లగా నవ్వేవి .
.పోనీ ఒద్దికగా కూర్చుంటే బుద్దిగా ఒదిగి గుసగుస లాడేవి ..నిద్దర్లో కూడా మెత్తగా కదులుతూ నా పాదాలతో లెక్కలేనన్ని ఊసులు చెప్పేవి ...

మోకాలి పై తలవాల్చి ఆలోచనలో ఉంటే నాకు తెలియకుండానే చేతి వేళ్ళతో ముచ్చట్లు పెట్టేసేవి.. 
 ఎర్రటిపారాణి తో కలిసి తెల్లగా మెరిసిపోతూ కొత్త అందాలను విరజిమ్మేవి ... అవి పాదాల చెంత ఉండి స్నేహితుల మధ్య గర్వంగా తల ఎత్తుకునేలా చేసేవి... 


దాగుడుమూతలప్పుడు మాత్రం ఎప్పుడూ దొంగను నన్నే చేసేవి .. మెత్తని సవ్వడి చేస్తూ అబ్బాయిల గుండెల్లో నిశబ్ధపు గంటలు మోగించేవి ...ఎన్నెన్నో అనుభూతులకు ఆలవాలు  నా మువ్వలపట్టీలు 

9 comments:

శిశిర said...

ఇప్పుడు లేవాండీ? బాగున్నాయి మీ మువ్వల పట్టీల అనుభూతులు. ఈ మధ్య మీరు రాయడం లేదు. తరచుగా రాస్తూ ఉండండి. బాగా రాస్తారు మీరు.

మధురవాణి said...

అంతా బావుంది గానీ.. నాకా బొమ్మే నచ్చలేదు.. అమ్మాయిల పాదాలే దొరకలేదా మీకసలు.. :(

sneha said...

శిశిరగారు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నారా? :)ధన్యవాదాలు
మధురవాణి గారు అమ్మాయిల పాదాలు దొరకలేదు :( నా మువ్వలపట్టీల పోటొ పెడదామనుకున్నాను అంత సమయంలేక నెట్లోది పెట్టాను

మాలా కుమార్ said...

మీ మువ్వల పట్టీలు బాగున్నాయండి .

జయ said...

మువ్వల పట్టీలు కాలికి చాలా అందమిస్తాయండి. తప్పకుండా మీ ఫొటోనే పెట్టండి. మరి ఇప్పుడు పెట్టుకుంటున్నారాలేదా:)

sneha said...

జయగారు ధన్యవాదాలు ,కొన్నీరోజులు పడలేదని తీసేసాను ,ఆ తర్వాత మర్చిపోయాను.మొన్న గుర్తొచ్చాయి .మళ్ళీ పెట్టుకున్నాను

sneha said...

మాల కుమార్ గారు ధన్యవాదాలు

డేవిడ్ said...

స్నేహ గారు చాలా చాలా బాగుంది మీ కవిత...నాకు అమ్మాయిలు పట్టీలు పెట్టుకుంటె అంత ఇస్టం ఉండదు (కారణం ఉందనుకో) ...కానీ మీ కవిత చదివాక ఎందుకొ మువ్వలపై కాస్తా ఇస్టం కలుగుతుంది...

sneha said...

డేవిడ్ గారు ధన్యవాదాలు