Tuesday, 5 July 2011

కాగితపు పడవ



వానాకాలం రాగానే
ప్రతి పసివాడు ఒక శ్రామికుడే
తలమునకలుగా నీ తయారీకు
ప్రతి నిమిషం తను తయారే!

పేరుకి ప్రయాణించలేమని గాని
పాలబుగ్గల పసిడి నవ్వులు
మోసుకుపోతూనే ఉంటావు

నువ్వు కదులుతూ మమ్మల్ని కదిలిస్తూ
నువ్వు తరలుతూ స్మృతులను తలపిస్తూ
నువ్వు తడుస్తూ మము ఆనందంలో తడిపేస్తూ


పిల్లకాలువలో నీవే ...బకెట్టు నీటిలో నీవే
బురదగుంటలో నీవే... నీటి చెలమలో నీవే
కాదేది నీ పయనానికి అనర్హం

పట్టు మని పదినిమిషాలే నీ జీవితం
కాని పట్టలేని కేరింతల మధ్య నీ గమనం

 
అమ్మ ఒడిలో నాన్న చేతిలో
అక్క జతలో అన్న తోడులో
నువ్వు జన్మిస్తూనే
ఎన్నెన్నో  జ్ఞాపకాలను రవాణా చేసేస్తావు కదా!

6 comments:

Anonymous said...

చాలా బాగా వర్ణించారు, ప్రయాణించ లెకపొవచ్చు గాని, నిజం పడవ ప్రయాణం కంటే ఎక్కువ ఆనందం ఇస్తుంది ఆ వయసుకి.. ఆ ఙ్ఙాపకం కూడా అంతే ఆనందం ఇస్తుంది!!

కొత్త పాళీ said...

cute

మధురవాణి said...

Sweet! :)

sneha said...

anonymous gaaru kottapaali gaaru madhura vaani gaaru thank you very much

వేణూ శ్రీకాంత్ said...

"పట్టు మని పదినిమిషాలే నీ జీవితం
కాని పట్టలేని కేరింతల మధ్య నీ గమనం "

ఈ లైన్స్ బాగా నచ్చాయండీ..

sneha said...

venu sreekanth gaaru thank you