Wednesday, 31 August 2011

ఎవరు చెప్తారు నీకు?


నీతోఉన్న ప్రతిక్షణం  పోట్లాడాలనిపిస్తుంది
నువ్వెళ్లిన మరుక్షణమే  మాట్లాడాలనిపిస్తుంది
నీ సమక్షంలోకంటే నీ నిరీక్షణలోనే ఎక్కువ ప్రేమిస్తున్నానేమో ....

 నీ తడికన్నుల చల్లదనం చెంపకు తాకినట్లవుతుంది
ఆ వేడినిట్టూర్పు వెచ్చదనం తనువును తడుముతునే ఉంది
అలిగిన నీమోము బింకంగా నను చూస్తున్నట్లనిపిస్తుంది
అంతలోనే కోపాల కారాల ఘాటు అలుముకుంటుంది.

నన్నర్ధం చేసుకోవట్లేదని కోప్పడతాను కాని
నిజానికి నాకు నేనే అర్ధంకావట్లేదని ఎలా చెప్పను నీకు ?
ఏకాంతపు వాకిట్లో మౌనంగా
నీ తలపుల రంగవల్లులు దిద్దుతూ
నిదురరాని నిశిరాత్రులు గడుపుతున్నానని
ఎవరు చెప్తారు నీకు?

9 comments:

వేణూ శ్రీకాంత్ said...

>>ఏకాంతపు వాకిట్లో మౌనంగా
నీ తలపుల రంగవల్లులు దిద్దుతూ<<
చాలా బగుందండీ..

kiran said...

nice..:)

SRRao said...

బావుంది.
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

శిరాకదంబం వెబ్ పత్రిక

డేవిడ్ said...

స్నేహ గారు, మీ కవిత చాలా చాలా బాగుంది.

sneha said...

venusrikanth gaaru kiran gaaru sr rao gaaru devidi gaaru
thank you very much

మనసు పలికే said...

సూపర్ గా ఉంది స్నేహ గారూ.. ఆ పిక్ అయితే భలే సరిపోయింది మీ కవితకి:)

శిశిర said...

చాలా బాగుందండీ.

మధురవాణి said...

పోనీ నన్ను వెళ్లి చెప్పమంటారా స్నేహ గారూ.. 'మధుర రాయబారం' ఫలిస్తుందేమో! ;)

Beautiful! :)

kallurisailabala said...

ఏకాంతపు వాకిట్లో మౌనంగా
నీ తలపుల రంగవల్లులు దిద్దుతూ

చాలా బావుందండి.