Friday, 14 October 2011

ఎందుకూ ???






కన్నీటికి నేనంటే ఎంత ఇష్టమో కాస్త బాధపడగానే 
వెచ్చని స్పర్శతో బుగ్గలు తడిమి  తోడుగా వస్తుంది..


మోకాళ్ళు నాకు  మరింత దగ్గరకు చేరి  
 తలను తన ఒడిలోకి తీసుకుని ఓదారుస్తాయి


చేతులు చుట్టూ పెనవేసి  గట్టిగా హత్తుకుని
నీకు నేనున్నాను అంటూ ధైర్యం చెప్పుతాయి..


ముంగురులు నా నుదిటి పై తారాడుతూ 
లాలనగా నిమురుతూ నాబాధని తగ్గించే ప్రయత్నం చేస్తాయి..


నా కోసం ఇవన్ని ఇంత తపన పడుతుంటే 
పిచ్చిమనసు ఇంకేవరికోసమో ఎదురుచూస్తుంది ఎందుకూ ???

6 comments:

మధురవాణి said...

నేనొచ్చేసాను స్నేహ గారూ.. ఇంక బెంగ పడకండి.. :P
అయినా, ఇంత ముద్దుగా బెంగ పెట్టేసుకుంటే ఎలాగండీ? Good one! :)

శరత్ 'కాలమ్' said...

నచ్చింది.

రసజ్ఞ said...

ఒక్కసారి అలా హృదయాన్ని పిండేసారండీ! చాలా బాగుంది!

sneha said...

హమ్మయ్య వచ్చేసారా.. బెంగకే బెంగొచ్చేంతగా బెంగపడిపోయాను మధుర గారు :)
శరత్ గారు ధాంక్యూ
రసజ్ఞ గారు :)))))) థేంక్యూ

శిశిర said...

అవును కదా. ఎందుకో మరి! బాగుందండి.

kiran said...

వహ్వా...అద్బుతం..!!
బాధ కాదు..మీరు చెప్పిన విధానం :)